Vinayakhan : రీసెంట్ గా విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి ఈ సినిమా దాదాపుగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది. రజినీకాంత్ తో పాటుగా ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా వర్మ అనే మెయిన్ విలన్ క్యారక్టర్ చేసిన వినాయకన్ కి ఏ రేంజ్ పాపులారిటీ వచ్చిందో మనమంతా చూసాము.
ఇందులో ఇతని నటన సినిమాకి పెద్ద హైలైట్ అయ్యింది. క్రూరమైన విలనిజం పండిస్తూనే, మధ్యలో హ్యూమర్ మరియు కామెడీ టైమింగ్ తో నవ్వించాడు. అయితే ఈయన రీల్ లైఫ్ లో మాత్రమే కాదు, నిజ జీవితం లో కూడా విలన్ వేషాలు వేస్తాడని నిన్ననే అర్థం అయ్యింది. పూర్తి వివరాలేంటో ఒకసారి ఈ కథనం లో చూద్దాం.
వినాయకన్ ఉంటున్న అపార్ట్మెంట్స్ లో తమని ఇబ్బంది పెడుతున్నాడు అంటూ అపార్ట్మెంట్స్ లో ఉన్న ఆడవాళ్లు, మరియు ఇతరులు వినాయకన్ పై కేసు నమోదు చేసారు. అపార్ట్మెంట్ వాసుల కేసుని స్వీకరించిన ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీసులు వినాయకన్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మద్యం మత్తులో ఉన్న వినాయకన్ సహనం కోల్పోయి గొడవకు దిగాడని, అతనిని నిలువరించడానికి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడం తో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అంటూ అపార్ట్మెంట్ వాసులు పేర్కొన్నారు.
ఇక ఈయన మందు త్రాగాడా లేదా అనే విషయం తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేసారు. వినాయకన్ కి ఇలా అరెస్ట్ అవ్వడం ఇది కొత్తేమి కాదు, గతం లో కూడా ఒక ప్రముఖ మోడల్ ని వేధింపులకు గురి చేసిన ఆరోపణపై అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకి వచ్చి సినిమాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ కేసు ఆయనకీ ఎంత జఠిలంగా మారబోతుందో చూడాలి.