టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 5న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట పూజా హెగ్డేని అనుకున్నారు మేకర్స్. అయితే అప్పట్లో విజయ్ దేవరకొండ ఆమెను రిజెక్ట్ చేశాడని వార్తలు వచ్చాయి. నిజానికి ఈ సినిమా కంటే ముందే వీరి కాంబోలో మరో సినిమా కూడా సెట్ అయింది. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనలో విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారట. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ఆ సమయంలో విజయ్, పూజా హెగ్డే మధ్య కొన్ని ఇష్యూలు వచ్చాయట. అందుకే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో పూజకు అవకాశం ఇవ్వలేదు. అయితే విజయ్ దేవరకొండ పక్కన పూజా హెగ్డే కంటే మృణాల్ ఠాకూర్ బాగా సెట్ అయ్యిందని అంటున్నారు. చూద్దాం ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..? విజయ్ దేవరకొండ కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో..?