Roja కూతురు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ.. ఆ స్టార్ హీరోతో కన్ఫాం !




Roja : సినీ నటి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ వెలుగు వెలిగింది. ఎన్నో సినిమాల్లో నటించి భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుంది రోజా. ఆ తర్వాత తమిళ్ డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమకు నిదర్శనంగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కలిగారు. రోజా కూతురు పేరు అన్షు మాలిక. ఈమె గురించి కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎంతో మందికి సాయం చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గత కొద్ది రోజులుగా రోజా కూతురు అన్షు మాలిక ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Roja Roja

ఇప్పటికే చాలామంది దర్శక, నిర్మాతలు రోజా కూతురు అన్షుని తమ సినిమాల్లో నటింపజేయాలని రోజా దగ్గర ఆఫర్లు పెడుతున్నారట. ముఖ్యంగా కోలీవుడ్ దర్శక, నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారట. అన్షు మాలిక సినిమాల్లోకి వస్తే ఖచ్చితంగా హీరోయిన్ గా ఓ రేంజ్ లో సక్సెస్ అవుతుందని రోజా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక రోజకు కోలీవుడ్, టాలీవుడ్ లో మంచి ఫ్యాన్స్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. రోజా భర్త కూడా డైరెక్టర్ కావడంతో ఇండస్ట్రీలోని చాలామంది డైరెక్టర్లు అన్షును ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశాన్ని మాకివ్వమంటూ అడుగుతున్నారట.

Roja Daughter

కాకపోతే ప్రస్తుతం అన్షు మాత్రం స్టడీస్ పై ఫోకస్ పెడుతుందని భవిష్యత్ లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ఛాన్స్ ఖచ్చితంగా ఉందని తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఒకవేళ అన్షు ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయితే కచ్చితంగా టాప్ హీరోయిన్ అవుతుందనడంలో సందేహం లేదు. గతంలో కూడా విక్రమ్ కుమారుడితో ఈమె కోలీవుడ్లో హీరోయిన్ ఎంట్రి ఇవ్వాల్సి ఉండగా ఏవో కారణాలతో ఆ సినిమా మిస్ అయింది. అయితే ఈసారి కోలీవుడ్, టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోతో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందట. ఇక ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న రోజా ఎలక్షన్స్ బిజీ అయిపోయిన తర్వాత తన కూతురు అన్షు సినీ ఎంట్రీ పై క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.