సినీ పరిశ్రమలో చాలా మంది ఆర్టిస్టులు వేల కోట్లకు అధిపతులని తెలుస్తోంది. వారిలో శోభన్ బాబు, అక్కినేని నాగార్జున లాంటి వారు ముందు వరుసలో నిలుస్తారు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఆస్తులు విలువలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఆస్తుల చిట్టా బయటికి వచ్చింది. ప్రభాస్ ఆస్తుల విలువ తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆయన తన కెరీర్లో ఎన్ని వేల కోట్లు సంపాదించాడో తెలుసుకుందాం. ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కొడుకు ఉప్పలపాటి ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్ కు పెదనాన్న అవుతారు. తన పెదనాన్న సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లోకి వచ్చారు. మొదట్లో తాను నటించిన ఒకటి రెండు సినిమాలు ఫర్వాలేదు అనిపించాయి. కానీ వర్షం సినిమా తన కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తర్వాత వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్గా నిలిచాయి. ప్రస్తుతం తాను తీసిన ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతుంది.

ప్రభాస్ ప్రస్తుతం రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక ప్రభాస్ ఆస్తుల విలువ దాదాపు రూ.8 వేల కోట్లని తెలుస్తోంది. ప్రభాస్ కు తన సొంత ఊర్లో పొలాలు అలాగే ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో ఖరీదైన ఫ్లాట్స్, విల్లాలు ఉన్నాయట. అలాగే ఆయనకు రెండు మూడు ఫామ్ హౌసులు, కొబ్బరి తోటలు అలాగే లగ్జరీ కార్లు, బైక్లు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా మల్టీప్లెక్స్ థియేటర్లకు కూడా ప్రభాస్ యజమాని. అంతే కాదు ప్రభాస్ నాన్న సూర్యనారాయణ రాజుకు అప్పట్లోనే గ్రానైట్ ఫ్యాక్టరీ ఉండేదట. స్థిరాచరాస్తులు అన్నీ కలిపి ప్రభాస్ మొత్తం ఆస్తుల విలువ రూ.8000 కోట్లు.
