Tasty Teja : నటుడు టేస్టీ తేజ గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన యూట్యూబర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్ షోలో పలు స్కిట్స్ చేసిన అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. ఇటీవల బిగ్‌బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఎన్నడూ లేని విధంగా ప్రేక్షకులను ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు. టైమింగ్ పంచులు, జోకులతో ప్రేక్షకులను అలరించాడు. ఇక బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక టేస్టీ తేజా ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ నిత్యం ట్రెండింగ్ లో ఉంటున్నాడు. అంతేకాకుండా బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్స్ శుభశ్రీ, ప్రియాంక, రతిక, అమర్ దీప్ వంటి వారితో ఎంజాయ్ చేస్తూ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తున్నారు. తాజాగా, టేస్జీ తేజ తనను కిడ్నాప్ చేసినట్లు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

అసలు విషయంలోకి వెళితే.. బిగ్‌బాస్ అమర్ దీప్, టేస్టీ తేజ ఓ చోట మాట్లాడుకుంటుంటారు. అయితే అప్పుడే అమర్ బయటకు వెళదాం.. అర్జెంట్ పని ఉందని అంటాడు. దానికి తేజ ఇప్పుడు ఎక్కడికి నేను రాను.. నా వల్ల కాదు.. నేను రాను.. ఇంత రాత్రి పూట అని చెబుతాడు. దీంతో అమర్ కోపంగా తేజను నెట్టుకుంటూ తీసుకెళ్లి కారు డోర్ తీసి కార్లోకి నెట్టి తీసుకెళతాడు. ఇక వీరిద్దరు రా అనే రెస్టారెంట్‌కు వెళ్లి స్పెషల్ ఐటెమ్స్ అన్నితింటారు.
చాలా బాగున్నాయని రివ్యూ కూడా ఇచ్చి అక్కడున్న అస్సాం వ్యక్తితో ఫొటో దిగుతారు. ఆ తర్వాత అందులో వారు తిన్న ఐటెమ్స్ గురించి రివ్యూలు ఇస్తాడు టేస్టీ తేజా. అయితే ఈ వీడియోను షేర్ చేస్తూ టేస్టీ తేజ ‘‘నన్ను అమర్ దీప్ కిడ్నాప్ చేశాడు’’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. అయితే ఇదంతా వ్యూస్ పెంచుకోవడానికి చేసిన స్కిట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు అమర్ అన్నతో మామూలుగా ఉండదని కామెంట్లు చేస్తున్నారు.
