Actress : బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాల్లో నటించి సక్సెస్ అందుకుంది. దీంతో అమ్మడి ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. భీద్, అఫ్వా, థాంక్యూ ఫర్ కమింగ్, ది లేడీ కిల్లర్ లాంటి సినిమాల్లో నటించి జనాలను మెప్పించింది. ఇక ప్రస్తుతం క్రైమ్ థ్రిలర్ బక్షక్ సినిమాతో అలరించబోతుంది. ఈ మూవీలో లైంగిక వేధింపుల నుంచి బాలికలను రక్షించే జర్నలిస్టు పాత్ర పోషిస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఈ అమ్మడు తన నిజ జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి మీడియాకు చెప్పుకొచ్చింది.
14 ఏళ్ల వయసులో ఓ అపరిచిత వ్యక్తి తనపై తప్పుగా ప్రవర్తించాడని.. ఆ సంఘటనను గుర్తుచేసుకుంది. ఆ గాయం నుంచి తాను ఇప్పటికీ బయటపడలేదని.. గుర్తు వచ్చినప్పుడల్లా మానసికంగా కృంగిపోయి ఏడుస్తానంటూ వివరించింది. నాకు ఇప్పటికీ ఆ సంఘటన చాలా స్పష్టంగా గుర్తుంది. బాంద్రాలో నా టీనేజ్ లో ఉన్నప్పుడు జాతరలు జరుగుతూ ఉండేవి. బహుశా 14 సంవత్సరాల వయసు అనుకుంటా జాతర కోసం నా ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్ళా. అంతా నడుచుకుంటూ వెళ్తున్న టైంలో నన్ను ఎవరో వెనుక నుంచి గట్టిగా గిచ్చారు. నా ప్రైవేట్ పార్ట్‌లు టచ్ చేయడానికి ప్రయత్నించారు.
వెనక్కు తిరిగి చూస్తే రద్దీ ఉండడంతో ఎవరు చేశారో అప్పుడు నాకు అర్థం కాలేదు. ఎవరో నన్ను పదేపదే అదే విధంగా తాకడానికి ప్రయత్నించారు. ఏదో కోల్పోయినట్లు అనిపించింది. నా వాళ్లంతా నా చుట్టూ ఉన్నా వాళ్లకి ఏం జరిగిందో కూడా చెప్పలేని పరిస్థితి అంటూ వివరించింది. ఇక గతంలో ఇలానే చిన్న వయసులో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ హీరోయిన్ నిత్యామీనన్ వివరించిన సంగతి తెలిసిందే. చాలామంది నటీమణులు తమ బాల్యంలో తమకు ఎదురైనా వేధింపులను ఆ మధ్య మీటూ ఉద్యమంలో వివరించారు.