Sudigali Sudheer : మెగా కోడలు లావణ్య త్రిపాఠి కి జోడిగా సుడిగాలి సుధీర్..కానీ చివరికి ఏమైందంటే!

- Advertisement -

Sudugali Sudheer : జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ క్రేజ్ ని దక్కించుకొని , ఆ క్రేజ్ తో సినిమా ఆఫర్స్ ని సొంతం చేసుకొని ఇండస్ట్రీ లో మంచి స్థానం లో సెటిల్ అయిన వారిలో ఒకడు సుడిగాలి సుధీర్. ఈయన్ని అందరూ బుల్లితెర పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. ఆ రేంజ్ క్రేజ్ జబర్దస్త్ స్టార్స్ లో కానీ, మరే బుల్లితెర నటుడికి కానీ లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

sudigali sudheer
sudigali sudheer

సుడిగాలి సుధీర్ కి కామెడీ టైమింగ్ ని చూసి ఇండస్ట్రీ లో పెద్ద స్టార్ కమెడియన్ అవుతాడేమో అని అందరూ అనుకున్నారు. కొన్ని సినిమాల్లో కమెడియన్ గా చేసాడు కానీ, ఆ తర్వాత హీరోగా మారి వరుసగా హీరోగానే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నాలుగైదు సినిమాలలో హీరో గా చేసిన ఆయన కెరీర్ లో ‘గాలోడు’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఇప్పుడు ఆయన రీసెంట్ గా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమాతో మరోసారి హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా నుండి ‘అయ్యో పాపం సారూ’ అనే పాట విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇది కాసేపు పక్కన పెడితే సుడిగాలి సుధీర్ కి లావణ్య త్రిపాఠి పక్కన హీరో గా నటించే అద్భుతమైన ఛాన్స్ ఒకటి మిస్ అయ్యిందట.

- Advertisement -

అసలు విషయం లోకి వెళ్తే రీసెంట్ గానే లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా ముందుగా సుడిగాలి సుధీర్ ని అనుకున్నారట. కానీ సుధీర్ ఈ సిరీస్ ని చెయ్యడానికి భయపడ్డాడట. కారణం లావణ్య త్రిపాఠి మెగా బ్రదర్ నాగబాబు కి కోడలు అవ్వడమే. తన కోడలితో రొమాన్స్ చేస్తే నాగబాబు ఏమి అనుకుంటాడో అనే భయం తోనే ఈ సిరీస్ ని వదిలేసాడట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here