Bigg Boss : తెలుగులో హయ్యస్ట్ టీఆర్పీతో దూసుకుపోతున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఈ షో ద్వారా ఊహించని స్థాయిలో చాలా మంది కంటెస్టెంట్లకు భారీ పాపులారిటీ వచ్చింది. అలాంటి వారిలో లాస్ట్ వీక్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన దామిని ఒకరు. బిగ్ బాస్ హౌస్లో వంటలక్కగా పేరు సంపాదించుకుని ఫేమస్ అయిపోయింది. ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను తెలియజేసింది. వాస్తవానికి దామిని ప్యూర్ వెజిటేరియన్. ఇంట్లో కూడా నాన్ వెజ్ తినరు. కాకపోతే తాను గుడ్డు తింటానని చెప్పింది. బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన పాటను తానే పాడానని తెలిపింది. ఇప్పటివరకు తన శరీరం పైన ఒక్క పచ్చబొట్టు కూడా లేదని చెప్పింది. తన జీవితంలో ఏదైనా స్పెషల్ ఉంటే తప్ప ఆ పని చేయనని చెప్పుకొచ్చింది. తనకు ప్రేమ పెళ్లి అంటే ఇష్టమని తెలిపింది. కొన్ని రోజులు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటుందనేది తన ఒపీనియన్ గా చెప్పుకొచ్చింది.

ఇన్ డైరెక్టుగా సహజీవనం చేయడంలో ఎలాంటి తప్పు లేదంటూ హిట్ ఇచ్చింది. ఒకవేళ తానే కనుక ఇలాంటి పని చేయవలసి వస్తే తన కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుంటానని.. వాళ్ల పేరెంట్స్ తనను తప్పకుండా అర్థం చేసుకోగలరని అందుకే తాను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని చెప్పింది. అయితే తన ఇంట్లోకి ఎవరూ చికెన్ తీసుకురారని.. కానీ, బిగ్ బాస్ హౌస్ లో తాను చికెన్ కర్రీ కూడా వండానని తెలిపింది. అలా చికెన్ కూర వండినందుకు కూడా కామెంట్లు చేశారని తెలియజేసింది. షోకు సంబంధించి.. కొంత మేరకే ప్రసారం చేయడం మిగిలినది చేయకపోవడం వల్ల తన మీద కాస్త వ్యతిరేకత వచ్చిందంది. దామిని తెలిపిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దామిని మీద ప్రేక్షకుల్లో పాజిటివ్ నెస్ కూడా బాగానే ఉండడంతో బిగ్ బాస్ హౌస్లోకి ఆమె రీఎంట్రీ ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి.