Anushka : ప్రభాస్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిన అనుష్క.. అందుకే ఇంత వరకు పెళ్లి చేసుకోవట్లేదా ?

- Advertisement -

Anushka : స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున సరసన ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఈ యోగా టీచర్. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. అరుంధతి సినిమాలో తన అద్భుతమైన నటనతో జేజమ్మగా అందరి గుండెల్లో నిలిచిపోయింది. ఆ ఒక్క సినిమా అనుష్క కెరీర్ మలుపు తిప్పింది. అతి తక్కువ కాలంలోనే అనుష్క ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది.

అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేసింది. జీరో సైజ్ సినిమాతో దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ వెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మరోమారు జనాలు అవాక్కయ్యేలా చేసింది. గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత అనుష్క ఇప్పటి వరకు మరో సినిమాకు కమిట్ కాలేదు.

- Advertisement -

ఇదిలా ఉంటే అనుష్క దాదాపు నాలుగు పదుల వయసు వచ్చినా ఇప్పటి వరకు అనుష్క పెళ్లి చేసుకోలేదు. ఆమె పెళ్లికి సంబంధించిన అనే రూమర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. హీరో ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందని.. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చాలానే కథనాలే వెలుగులోకి వచ్చాయి. అయితే అవన్నీ కూడా కూడా ప్రచారాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ ప్రభాస్ ఇదిలా ఉంటే.. ప్రభాస్ సినిమాను అనుష్క రిజెక్ట్ చేసిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా మొదట అనుష్కను తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆ క్యారెక్టర్‌లో తాను సెట్ అవ్వననే ఉద్దేశంతో సినిమాకి నో చెప్పిందట. దీంతో ఆదిపురుష్‌లో కృతిసనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే ఆదిపురుష్‌ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో అనుష్క రిజెక్ట్ చేసి మంచి పని చేసిందని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here