Puri Jagannath : కెరీర్ మొదట్లో ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరికీ ఒకప్పుడు వరుస విజయాలను అందిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పూరీ సినిమాలే కాదు.. నిజ జీవితంలోనూ ఆయన మాట్లాడే మాటలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పూరి మాట్లాడే ప్రతి మాటలోనూ నిగూఢార్థం ఉంటుంది. పూరి జగన్నాథ్ తెరకెక్కించే ప్రతి సినిమాలోని కామన్ గా ఒక పాయింట్ రన్ అవుతుంది. కెరీర్ స్టార్టింగ్ సినిమా నుంచి డబుల్ ఇస్మార్ట్ వరకు దాదాపు 90శాతం సినిమాల్లో కచ్చితంగా ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే తండ్రి లేదా తల్లి చనిపోవడం. లేదా తండ్రి వదిలేయడం లాంటి కామన్ పాయింట్స్ కచ్చితంగా ఉండి తీరుతాయి. ఒక బ్రోకెన్ ఫ్యామిలీకి చెందిన క్యారెక్టర్ గా హీరో.. లేదా హీరోయిన్లనే లీడ్ తీసుకుని కథలు అల్లుతుంటాడు. ఉదాహరణకు టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ను ఓ అనాథగా చూపిస్తాడు.
అలాగే అమ్మ, నాన్న ఓ తమిళమ్మాయి మూవీలో రవితేజను తండ్రి వదిలేసిన కొడుకుగా చూపించాడు. ఇలా దాదాపు పూరి తన దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాల్లో హీరో లేదా హీరోయిన్ల కుటుంబానికి సంబంధించిన ఏదో ఒక ఇబ్బంది ఉండడం మాత్రం కామన్. గతంలో పూరీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. సుకుమార్ తో జరిగిన ఓ చిన్ని చిట్ చాట్‌లో భాగంగా దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ.. నాకు సంబంధించినంత వరకు అన్ని సవ్యంగా ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చే పిల్లలకు ఏ విషయాలపై సరైన అవగాహన ఉండదు. తల్లిదండ్రులు సంపాదించి పెడితే వాళ్లు తిని ఎలా సంపాదించాలో మర్చిపోతుంటారు. కానీ తండ్రి చనిపోయిన పిల్లాడు జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో నేర్చుకుంటాడు. తల్లి చనిపోయిన ఇంట్లో ఎలా జీవించాలనే విషయం తెలుస్తుంది. అలాంటి ఇళ్ల నుంచి వచ్చిన పిల్లలు కూడా స్ట్రాంగ్ గా ఉంటారు. అదే విషయాన్ని నా సినిమాల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తా.
మనం ఎంతో కష్టపడి పిల్లలకు తిండి పెడితాం. కానీ పిల్లలకు కష్టం విలువ తెలియకుండా పెంచుతాం. అలా చాలామంది గొప్ప వాళ్ల పిల్లలు ఎందుకు పనికి రాకుండా అవుతున్నారు. కానీ స్ట్రగుల్స్ ఫేస్ చేసిన పిల్లలు మాత్రమే బయట ప్రపంచంలో ఎలా బ్రతకాలో తెలుసుకుంటున్నారు. వాళ్లను అడవిలో వదిలేసిన కూడా మళ్లీ ఇంటికి రాగలడు. అలా నా సినిమాలో క్యారెక్టర్స్ కి కూడా ఓ స్ట్రగుల్ క్రియేట్ చేసి.. ఆ స్ట్రగుల్ నుంచి హీరోయిజం ఎలా పుడుతుందో అనేది చూపిస్తా. అందుకే ఆ సినిమాలు బాగా ఆడుతాయని నేను నమ్ముతాను.. అంటూ పూరి జగన్నాథ్ వివరించాడు. ఇదే విషయాన్ని రియల్ లైఫ్ లో కూడా అప్లై చేసుకుంటే బాగుంటుందని.. ఎవరు పెడతారా తిందామా అని కాకుండా తామ కష్టపడిన దానితో పదిమందిని సాకితే ఆ తృప్తి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలంటూ చెప్పుకొచ్చాడు.