Sai Pallavi : కోట్లు ఇచ్చినా విజయ్ దేవరకొండ సినిమాలో చేయనంటూ తెగేసి చెప్పిన హీరోయిన్

- Advertisement -

Sai Pallavi : పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు హీరో విజయ్ దేవరకొండ. ఫస్ట్ సినిమాతోనే క్లాసికల్ హిట్ కొట్టాడు. ఆ వెంటనే అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు విజయ్. తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక విజయ్ ఎప్పుడూ సినిమాలు, ట్రోల్స్‌తో పాటు ఇండస్ట్రీలో ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలో తను నటించిన సినిమాల్లో ఓ యాటిట్యూడ్ కొనసాగించి రౌడీ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు.

అయితే ఇప్పుడు విజయ్‌కి సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. విజయ్ దేవరకొండ సినిమాల్లో రెమ్యూనరేషన్ లక్షల్లో కాదు కోట్లలో అయినా నటించనని మొఖం మీదనే ఓ స్టార్ హీరోయిన్ తిరస్కరించిందన్న వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరని ఆలోచిస్తున్నారా. అసలు రౌడీ స్టార్ సినిమాలో నటించిందని చెప్పడానికి కారణం ఏంటో చూద్దాం. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు ఫిదా సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా, టాలీవుడ్ లో స్టార్ హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

- Advertisement -

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కథలో కంటెంట్ ఉన్నప్పుడే నటిస్తుంది. ఈ క్రమంలో ఏ స్టార్ హీరో సినిమా అయినా కథ నచ్చకపోతే తిరస్కరిస్తున్నారు. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాలో సాయి పల్లవి తొలిసారి హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఆమె ఆ సినిమాను తిరస్కరించింది. సమంత నటించిన ఖుషిలో విజయ్ పాత్రను సాయి పల్లవి తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీనికి కారణం విజయ్ దేవరకొండ సినిమాలకు వివాదాలు తప్పవని.. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాలని.. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా విజయ్ దేవరకొండ సినిమాల్లో నటించనని సాయి పల్లవి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here