Bro the avatar : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ ఈ నెల 28 వ తారీఖున గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ని గ్రాండ్ గా చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ బ్రో మూవీ స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ గా రాసి మా అందరికీ వినిపించినప్పుడే చాలా అద్భుతంగా అనిపించింది, ఇక రీసెంట్ గా కొన్ని రషెస్ ని చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాము. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ ఆడియన్స్ పదే పదే ఈ సినిమాని థియేటర్స్ కి వచ్చి చూస్తారు అని చెప్పుకొచ్చాడు థమన్.

ఈ సినిమాకి చివరి 30 నిమిషాలు చాలా ఎమోషనల్ గా ఉంటుందట, ప్రతీ ఒక్కరికీ కంటతడి పెట్టించేలా ఉంటుందట, చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ పోటెత్తుతారని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. ఇప్పటికీ విడుదలైన టీజర్ కి మరియు లిరికల్ వీడియో సాంగ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. చూడాలి మరి విడుదల తర్వాత కూడా అదే రేంజ్ టాక్ ఉంటుందో లేదో అనేది.
ఇక ఈ సినిమాకి సంబంధించిన రెండవ లిరికల్ వీడియో సాంగ్ ని ఈ వారం లోనే విడుదల చెయ్యబోతున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయబోతున్నారట. మొన్న విడుదల చేసిన మొదటి సాంగ్ మొదట్లో కాస్త నెగటివ్ రెస్పాన్స్ వచ్చినా, ఆ తర్వాత మెల్లగా పుంజుకొని ఇప్పుడు మంచి వ్యూస్ తో ముందుకు దూసుకెళ్తుంది.