‘అతడు’ మరియు ‘ఖలేజా’ లాంటి సినిమాల తర్వాత మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రం ప్రకటించిన రోజు నుండే ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలకు తగ్గట్టుగా కృష్ణ గారి పుట్టిన రోజు నాడు విడుదల చేసిన టీజర్ ఉంది కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయం లో థమన్ కాపీ కొట్టాడు అంటూ చాలా కామెంట్స్ వినిపించాయి.

సోషల్ మీడియా లో ఆయన పై విపరీతమైన ట్రోలింగ్స్ రావడం తో కొంతకాలం ఆయన సోషల్ మీడియా కి దూరం అయ్యాడు. అయితే నిన్న ఆయన మహేష్ బాబు తో విబేధాలు ఏర్పడి థమన్ ఈ సినిమా నుండి బయటకి వచేసాడని అధికారికంగా ఒక వార్త వచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టించింది, మహేష్ ఫ్యాన్స్ లో గందరగోళం ని సృష్టించింది.

కొత్త షెడ్యూల్ ఈ నెల 24 వ తేదీ నుండి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ షెడ్యూల్ లో మహేష్ మరియు శ్రీలీల మధ్య ఒక పాటని చిత్రీకరించేందుకు ప్లానింగ్ చేస్తున్నారు. కానీ థమన్ నుండి ఇప్పటి వరకు ట్యూన్ రెడీ అవ్వలేదు. దీనికి మహేష్ చాలా సీరియస్ అయ్యాడట. శాంపిల్ కోసం పంపిన రఫ్ ట్యూన్ కూడా మహేష్ బాబు కి నచ్చలేదట. ఈ విషయం పై ఆయన అసహనం వ్యక్తం చెయ్యడం తో థమన్ కి కోపం వచ్చి ఈ ప్రాజెక్ట్ నుండి బయటకి వచేసాడు.

గత కొంత కాలం క్రితమే ఈ సినిమా నుండి పూజ హెగ్డే కూడా తప్పుకుందట. ఇలా సినిమాకి సంబంధించిన కీలక వ్యక్తులు తప్పుకోవడం తో మూవీ ని ఆపేయమంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసారు. అయితే మేకర్స్ ఇప్పుడు థమన్ ని ఒప్పించి మళ్ళీ సినిమాకి పని చేసేలా చేస్తున్నారు. రీసెంట్ గా ఒక మహేష్ బాబు ‘గుంటూరు కారం‘ నుండి థమన్ తప్పుకున్నాడు అని వస్తున్నా వార్తల్లో నిజం లేదని చెప్పడం, దాని క్రింద ఆ చిత్ర నిర్మాత నాగ వంశీ ‘థమ్స్ అప్’ సింబల్ వేసాడు. అంటే ఈ ప్రాజెక్ట్ లో థమన్ ఉన్నాడని దాని అర్థం అంటున్నారు ఫ్యాన్స్.