Vijay Thalapathy : చిత్ర పరిశ్రమలో సెలబ్రెటీలుగా దూసుకుపోతున్న నటీనటులు ఇప్పటికే చాలామంది పాలిటిక్స్ లోకి అడుగుపెట్టి రాణిస్తున్నారు. కొంతమంది సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి మరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగారు. మరి కొంతమంది సినిమాల్లో రాణిస్తూనే రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా ఇదే మార్గంలో నడవనన్నాడు. తాజాగా సొంత రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగంని ఏర్పాటు చేసుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2026 లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక రాజకీయాలకి వెళ్లిన తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్తాడంటూ ప్రచారం జరుగుతోంది.
కాగా విజయ్ ప్రస్తుతం తన 68వ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తరువాత సినిమానే విజయ్ లాస్ట్ మూవీ అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే విజయ్ మాత్రం తన 68వ సినిమా తర్వాత మరో స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించబోతున్నారంటూ తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో తన 69వ సినిమాకు విజయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో మూడు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందాయి. ఈ నేపథ్యంలో తన చివరి సినిమాకు కూడా విజయ అట్లీకే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే విజయ్ హీరోగా నటించే చివరి సినిమా కూడా ఇదే కానున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా తర్వాత విజయ్ పలు సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించి సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో బిజీ అయిపోతాడట. ఇక ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు. అయితే ఇప్పటికే రాజకీయాల్లో చాలామంది కోలీవుడ్ నటులు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ ఈ జాబితాలో చేరిపోయాడు. కాగా గతంలో తలైవర్ రజినీకాంత్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే తర్వాత ఆయన ఆలోచనలను విరమించుకున్నారు. ఇక కమల్ హాసన్ ఇప్పటికే రాజకీయాల్లో అడుగుపెట్టి ఇటు సినీ రంగంలోనూ అటు రాజకీయంలోనూ బిజీగా ఉన్నాడు. విజయ్ ఈ రెండింట్లో ఏ దారిని ఎంచుకుంటాడో చూడాలి.