ఎన్టీఆర్ టు ప్రభాస్.. సిల్వర్ స్క్రీన్​పై మెస్మరైజ్ చేసిన రామయ్యలు వీరే

- Advertisement -

రామాయణం.. ఈ ఇతిహాసం గురించి తెలియనవారంటూ ఉండరు. తండ్రి మాట కోసం అడవికి వెళ్లిన కుమారుడిగా.. సోదరులకు ఆదర్శప్రాయంగా నిలిచే అన్నగా.. ప్రజలకు ఏ లోటు రాకుండా పాలించిన మహారాజుగా.. భార్య కోసం పది తలల రావణుడితో యుద్ధం చేసిన రాఘవుడిగా.. శ్రీరాముడి చరిత్రలో నిలిచిపోయాడు. ఈ గాధను మనం కళ్లతో చూడకపోయినా.. పుస్తకాల్లో చదివాం. అయితే ఆ ఆజానుబాహుడి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించేందుకు ఇప్పటికే రామాయణంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ నీలిమేఘ శ్యాముడి గురించి ఇప్పటికే మనం ఎన్టీఆర్.. శోభన్ బాబు.. బాలకృష్ణ.. ఇలా చాలా మంది హీరోలు నటించిన రామాయణం సినిమాల్లో చూశాం. ఎన్నిసార్లు చూసినా.. ప్రతిసారి ఏదో కొత్తదనమే. రాముడి గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న ఆరాటమే.. రామాయణంపై తీస్తున్న సినిమాలకు కలిసివస్తోంది.

ప్రభాస్
ప్రభాస్

నీలిమేఘ శ్యాముడి సుందరవదనాన్ని ఇప్పటి వరకు దర్శకులు రకరకాలుగా వెండితెరపై చూపించారు. ఆ పాత్రలో కనిపించిన ప్రతి నటుడు.. రాముడంటే ఇలాగే ఉండేవాడు అని ప్రేక్షకుడు అనుకునేలా జీవించారు. అలా ఇన్నేళ్ల సినిమా చరిత్రలో రామాయణ గాథలో రాఘవుడిగా మెరిపించిన అందాల రాములు ఎంత మంది ఉన్నారో.. వాళ్లెవరెవరో ఓ సారి చూసేద్దామా..?

తెలుగు ప్రేక్షకులు దేవుడు అనగానే గుర్తొచ్చేది నందమూరి తారకరామా రావు. ముఖ్యంగా రాముడు.. కృష్ణుడు అనగానే ప్రేక్షకుల మదిలో మెదిలేది ఎన్టీఆర్ రూపమే. ఆ నటసార్వభౌముడు.. తన నటనతో.. రాముడంటే నిజంగా ఇలాగే ఉండేవాడేమో అని అనుకునేలా తన నటనతో మైమరిపించారు. ఎన్నో పౌరాణిక సినిమాల్లో రాముడిగా కనిపించిన ఆయన.. ‘శ్రీ రామ పట్టాభిషేకం’, ‘లవకుశ’ లాంటి సినిమాల్లో పూర్తి స్థాయి రాముడి పాత్రతో మెరిసి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు.

- Advertisement -
Shobanbabu

రాముడి పాత్రలో మెరిసి అందరి ప్రశంసలు అందుకున్నారు సీనియర్​ స్టార్​ శోభన్ బాబు. టాలీవుడ్​ సోగ్గాడైన శోభన్ బాబు.. ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో అలరించారు. రాముడు ఇంత అందంగా ఉండేవాడా అని ప్రేక్షకులు అబ్బురపడిపోయేలా ఈ సినిమాలో కనిపించారు శోభన్ బాబు.

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో రాముడు నట సింహం బాలకృష్ణ. ఆయన కూడా రాముడి పాత్రలో మెరిసి తండ్రికి తగ్గ తనయుడని ప్రూవ్ చేసుకున్నాడు. బాపు దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీ రామరాజ్యం’ సినిమాలో శ్రీ రాముడిలా కనిపించిన బాలయ్య.. తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.

నందమూరి వంశం నుంచి వచ్చిన మరో రాఘవుడు .. జూనియర్​ ఎన్​టీఆర్​. తాత, బాబాయ్​లాగా ఈ అబ్బాయి కూడా శ్రీ రాముడిగా కనిపించి అభిమానులను అలరించారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’ సినిమాలో రాముడి పాత్రలో కనిపించారు.

lord suman as venakatesh

వేంకటేశ్వర స్వామి అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది సుమన్. ఆయన తిరుమలేశుడిగానే కాదు.. శ్రీ రాముడి పాత్రలోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరామదాసు’ చిత్రంలో రాముడిలా కనిపించి అందరి ప్రశంసలను అందుకున్నారు.

ఇంతమందిని హీరోలను రాముడి పాత్రలో చూసిన ప్రేక్షకులు ఇప్పుడు మరో రాఘవరాముడిని చూడబోతున్నారు. నేటి తరం రామయ్యగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఔం రౌత్​ తెరకెక్కిస్తున్న మైథలాజికల్​ మూవీ ‘ఆదిపురుష్​’లో రాముడి పాత్రను పోషించాడు ప్రభాస్. మరి ఈ రాముడు.. ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here