సినిమాల్లో హీరోలు హీరోయిన్లు ఎంత ఇంపార్టెంటో బుల్లి తెరపై యాంకర్లు అంత ఇంపార్టెంట్. అందుకే వారికి ఎంతో క్రేజ్ ఉంటుంది. యాంకర్స్ కు కూడా సినిమా హీరోలు, హీరోయిన్ల రేంజ్ లో అభిమానులు ఉంటారు. దాంతో యాంకర్లు కూడా హీరోలు, హీరోయిన్లుగా సినిమాల్లో నటిస్తున్నారు. కొంతమంది అయితే వరుస సినిమాలతో బిజీ అయ్యారు కూడా. ఇక బుల్లి తెరపై సందడి చేసే యాంకర్లు కూడా తమ కష్టానికి తగ్గినట్టుగా రెమ్యునరేషన్ కూడా పుచ్చుకుంటారు. ఎపిసోడ్ లేదా ఆడియో ఫంక్షన్లకు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారో తెలుసుకుందాం.

తెలుగులో టాప్ యంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల రూ.2.5 లక్షలు పుచ్చుకుంటోందిట. సుమ ప్రస్తుతం సినిమాలోనూ నటిస్తోంది. యాంకర్ మంజూష ప్రస్తుతం రూ.30వేల దాకా తీసుకుంటోందని టాక్. ఇంటర్య్వూలలో ఎక్కువగా మంజూష కనిపిస్తూ ఉంటుంది. యంకర్ రవి ప్రస్తుతం లక్షరూపాయల రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. యాంకర్ వర్షిని రూ.30వేలు మాత్రమే తీసుకుంటోందట. జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ శ్యామల ప్రస్తుతం రూ.50వేల దాకా అందుకుంటుదిట. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. శ్రీముఖి కూడా లక్ష రూపాయలకు పైగానే అందుకుంటుందిట.

యాంకర్ ప్రదీప్ మేల్ యాంకర్స్ లో టాప్ స్థానంలో ఉంటాడు. ప్రదీప్ లక్ష రూపాయలు తీసుకుంటున్నాడుట. అప్పుడప్పుడూ కనిపించే శిల్పా చక్రవర్తి రూ.25వేల నుండి రూ.50 వేల వరకు తీసుకుంటుందని సమాచారం. జబర్దస్త్ బ్యూటీ రష్మి లక్ష యాబైవేల నుండి లక్షా డెబ్బై ఐదు వేల వరకూ రెమ్యునరేషన్ పుచ్చుకుంటోందిట. మరో జబర్దస్త్ యాంకర్ అనసూయ రెండు లక్షల రూపాయలు తీసుకుంటునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనసూయ సినిమాల్లో బిజీగా ఉంది. రీసెంట్ జబర్దస్త్ కొత్త జడ్జిగా సీరియల్ నటి సౌమ్య రావు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా సౌమ్యరావ్ కు కూడా మల్లెమాల వారు రెమ్యునరేషన్ గట్టిగానే ఇస్తున్నట్టు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ కు సౌమ్యరావు రూ.60 వేలు తీసుకుంటున్నట్టు టాక్.