Telugu Actress : తెలుగు చిత్రపరిశ్రమలోని హీరోయిన్లు ఒక్కొక్కరు ఒక్కోరకమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే..ఒకొక్కరిగా తమకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి బయటపెడుతుంటే అభిమానులు ఆందోళనకు గురవుతున్నాయి.. అసలు ఎందుకు హీరోయిన్లకు ఇలాంటి అరుదైన వ్యాదులు వస్తున్నాయి.. ఏదైనా మాయా.. లేదా ఇంకేదైనా ఉందా అనే సందేహాలు అందరికి వస్తున్నాయి.. ఇది అంతుచిక్కని ప్రశ్నలా మారింది.. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు ఇలాంటి వ్యాధుల బారిన పడటం అందరిని ఆలోచనలో పడేస్తుంది.. కొందరు ఇందుకు కారణం వారు వేసుకొనే మేకప్ అని, ఫుడ్ వల్ల, లొకేషన్ వల్ల అని చెప్తున్నారు.. అది నిజమే అనుకోండి.. కానీ, అంతకన్నా బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు..

ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలిసిన ఆమె అభిమానులు ఆ దిగులు నుంచి కోలుకోనేలేదు. సమంత మమోసైటిస్ వ్యాధి తో బాధపడుతోన్న విషయం తెలిసిందే. గతకొంతకాలంగా ఆమె ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. ఇప్పుడు సమంత ఎలా ఉన్నారు? బానే ఉన్నారా… ఆమెకొచ్చిన మమోసైటిస్ వ్యాధి పూర్తిగా తగ్గినట్లేనా.. షూటింగ్‌లకు వెళుతోదంటే పూర్తిగా కోలుకున్నట్టేగా.. మళ్లీ వర్కవుట్స్ చేస్తూ.. వైరల్ అవుతున్నారంటే.. ఆమె పూర్తిగా కోలుకుందా ఇలా రకరకాల ప్రశ్నలు ఆమె అభిమానులు వేస్తున్నారు.

అలాగే తమిళ్ హీరో జీవా నటించిన రంగం లో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఫియాబాజ్ పై. తాను కూడా మయో సైటిస్ వ్యాధితో బాధపడుతున్నా అని తెలిపింది. మయోసైటిస్ వ్యాధి ఉందని తెలిసిన వెంటనే తాను ఇంట్లో వారికి కూడా ఈ విషయం చెప్పలేదని, ఇంట్లో వారికి తెలియకుండా ముంబైలో ఉండి ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నానని తెలిపింది.. హీరోయిన్ అనుష్క కూడా అదే విధంగా బాధపడుతుంది.. ఆమెకు అతిగా నవ్వే ఒక జబ్బు ఉందని అంటున్నారు.
తన అనారోగ్యం గురించిన టాప్ సీక్రెట్స్ బైటపెట్టుకున్నారు రేణు. కొన్నాళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా. దాన్ని ఫేస్ చెయ్యడానిక్కావల్సిన శక్తిని ఇప్పుడిప్పుడే కూడదీసుకుంటున్నా. అంటూ ఇన్‌స్టాలో ఆమె చేసిన పోస్ట్. వైరల్‌గా మారింది. నాలాగే ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపడమే ఈ పోస్ట్ ఉద్దేశ్యం అంటూ చెప్పుకొచ్చారు రేణుదేశాయ్.. ఈమె కాదు ఇంకా కొందరు హీరోయిన్లు అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు..