తెలుగు హీరోయిన్ నటి Meena Sagar గురించి ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. అదే ఆమె రెండో పెళ్ళి చేసుకుంటుందని, తనకు అత్యంత సన్నిహితుడుతో త్వరలోనే పెళ్ళి అంటూ వార్తలు గుప్పుమన్నాయి.. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్ళి పై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈ విషయం పై ఆమె స్పదించక పోవడంతో అది నిజమే అని ఆమె అభిమానులు కూడా అనుకున్నారు.
ఇటీవలె భర్త విద్యాసాగర్ ఆరోగ్య సమస్య తో పోరాడుతు,ఊపిరితిత్తుల సమస్య ఎక్కువ అవ్వడంతో మరణించారు.. చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుస షూటింగ్స్‌లో పాల్గొంటుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాలకు ఆమె సైన్ చేసింది. ఇదిలా ఉండగా గత రెండు, మూడు రోజులుగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి.
తల్లిదండ్రుల ఒత్తిడి, కూతురి భవిష్యత్తును దృష్టిని ఉంచుకొని మీనా రెండో పెళ్లికి ఒకే చెప్పిందంటూ వార్తలు వైరల్ అవతున్నాయి. ఈ విషయం మీనా చెవిన కూడా పడిందట. దీంతో ఇలాంటి రూమర్స్‌ని వైరల్ చేస్తున్నందుకు మీనా ఆగ్రహం వ్యక్తం చేసిందట. ‘డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని రాయండి.
నా భర్త చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు. తనపై అసత్య వార్తలు రాస్తే వాళ్లపై చర్యలు తీసుకుంటా’ అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక మీనా రెండో పెళ్లిపై వస్తున్న వార్తలను ఆమె క్లోజ్‌ఫ్రెండ్ ఒకరు తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ఒకవేళ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మీనానే స్వయంగా ప్రకటిస్తుందని,ఇలాంటి అసత్యపు పుకార్లు చెయ్యొద్దని చెప్పారు.ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు భాద పడినట్లు తెలుస్తుంది..అప్పట్లో స్టార్ హీరోలు సైతం మా సినిమాల్లో మీనా కచ్చితంగా హీరోయిన్ గా చేయాలి అని పట్టుబట్టి కూర్చునేవారు.
అంతేకాదు ఒకవేళ మీనా డేట్స్ ఖాళీగా లేకపోతే ఆ సినిమా షూటింగ్ కూడా వాయిదా వేసేవారంటే అప్పట్లో మీనా క్రేజ్ ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈమె ఎన్నో సినిమాల్లో నటించి చాలామంది అభిమానులను సంపాదించుకుంది.ప్రస్తుతం మీనా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజిగా ఉంది.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆ సినిమాలు విడుదల కానున్నాయి..