Kasturi Shankar : వెండితెర పై వెలుగి ఎంతోమంది ఆర్టిస్టులు బుల్లితెరపైకి వచ్చారు. అలా వచ్చి రాణిస్తున్న వారిలో నటి కస్తూరి శంకర్ కూడా ఒకరు. ఒకప్పుడు స్టార్, అప్‌కమింగ్ హీరోలతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించింది కస్తూరి. ప్రస్తుతం సీరియల్స్‌లోకి వచ్చి, ఒక సీరియల్‌లో లీడ్‌గా చేసి మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ఆన్ స్క్రీన్ తను ఎలా ఉన్నా.. ఆఫ్ స్క్రీన్ మాత్రం మనసులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్థత్వం తనది. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి పలు చిత్రాల్లో నటించి, ఇండస్ట్రీకి దూరమైంది నటి కస్తూరి శంకర్. బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ లో తులసి పాత్రలో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకుల వద్ద ప్రశంసలు అందుకుంది. కస్తూరి మరోవైపు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తుంది.
ఇకపోతే సోషల్ మీడియాలో కూడా ఆ అమ్మడు చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు, సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుంది. అప్పుడప్పుడు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తోంది. అయితే తాజాగా నటి కస్తూరి ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘జెంటిల్‌మెన్ మూవీ హిందీ రీమేక్ లో నాకు అవకావం వచ్చింది. కానీ ఆ సమయంలో టైఫాయిడ్ వచ్చిన కారణంగా చేయలేకపోయాను. సీనియర్ హీరో మోహన్ బాబు సరసన కూడా ఓ సినిమాలో అవకాశం వచ్చినా అప్పుడు ఏదో కారణంతో చేయలేకపోయాను.
అలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్ మూవీలో అయితే ఏకంగా మూడు సార్లు అవకాశం వచ్చింది. కానీ నాకు నటించడానికి కుదరలేదు. చివరగా కాలా మూవీలో నటించాలని చాలా బతిమిలాడారు. కానీ రజనీకాంత్ పక్కన యంగ్ గా కనిపిస్తుండటంతో నన్ను తీసేశారు. డెవిల్ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన మరీ యంగ్ అయిపోయానని తీసేశారు. నాది మహేష్ బాబుకు జోడిగా చేయాల్సిన వయసు. తల్లి పాత్రలో నటించాలంటే మరో 30 ఏళ్లు ఆగాల్సిందే’’. అంటూ చెప్పుకొచ్చింది. కస్తూరి కామెంట్స్ విన్న జనాలు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.