Teja Sajja : బాలనటుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ కిడ్ గా పేరు తెచ్చుకున్న నటుడు తేజ సజ్జ. ముఖ్యంగా ‘ఇంద్ర’ సినిమాలో ‘నేనున్నా నాయనమ్మా’ అంటూ డైలాగ్ చెప్పి తొడగొట్టిన సన్నివేశం అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. అలాంటి ఎన్నో గుర్తుంచుకునే పాత్రలు ఆయన చిన్నతనం లోనే చేసాడు. ఇక పెద్దయ్యాక హీరో గా ఎంట్రీ ఇచ్చాడు, ‘హనుమాన్’ చిత్రానికి ముందు తేజ సజ్జ కి కావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు.

అందరి లాగానే ఇతను కూడా ఇండస్ట్రీ కి వచ్చాడు, మళ్ళీ ఇతనే తిరిగి వెళ్ళిపోతాడని అంతా అనుకున్నారు. కానీ రీసెంట్ గా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హనుమాన్’ చిత్రం మాత్రం బాక్స్ ఆఫీస్ లెక్కలు మార్చేసింది. ఇప్పటి వరకు ఏ హీరోకి కూడా సాధ్యం కానటువంటి రికార్డ్స్ ని నెలకొల్పిన ఈ సినిమా నార్త్ అమెరికా లో 5 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.

ఇది కాసేపు పక్కన పెడితే ఒక్క హిట్టు పడగానే రెండు మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఏ హీరో అయినా పెంచుతాడు. కానీ తేజా సజ్జ మాత్రం ఏకంగా 9 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని పెంచేసాడట. హనుమాన్ చిత్రం కోసం తేజ సజ్జ కేవలం కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే తీసుకున్నాడు.

ఆ తర్వాత సినిమా హిట్ అయ్యి భారీ లాభాలు వచ్చిన తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి మరో రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇచ్చాడు. కానీ తేజ తన తదుపరి చిత్రానికి ఏకంగా 10 కోట్ల రూపాయిలు డిమాండ్ చెయ్యడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఒక సినిమా కోసం ఈమధ్య కాలం లో తీసుకోవడం లేదట.