Teja Sajja : తేజ సజ్జ.. ప్రస్తుతం ఈ పేరు నేషనల్ వైడ్ ట్రేండింగ్ లో ఉంది. కారణం హనుమాన్(HanuMan) సినిమా. తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. సినిమాటిక్ జీనియస్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ఇప్పటివరకు రూ.280 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్ లో చేరనుంది. ఇక సినిమాలో హనుమంతు పాత్రలో కనిపించిన హీరో తేజ సజ్జకు ప్రశంసలు దక్కుతున్నాయి.

తన అద్భుతమైన నటనతో ఆడియన్జ్స్ ను మెస్మరైజ్ చేశాడు తేజ. ప్రతీ సీన్ లో హనుమాన్ కోసం పడ్డ కష్టం క్లియర్ గా కనిపిస్తుంది. క్లాస్, యాక్షన్, ఎమోషన్, కామెడీ అని తేడా లేకుండా ప్రతీ సీన్ లో తన సత్తా చాటుకున్నాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. హనుమాన్ సినిమా కోసం హీరో తేజ సజ్జ దాదాపు 75 సినిమాలను వదులుకున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ హనుమాన్ సినిమా కోసం తాను దాదాపు 70 నుండి 75 సినిమాలు వదులుక్కున్నాను అని చెప్పుకొచ్చాడు.

అది విన్న నెటిజన్స్ అండ్ ఆడియన్స్ అవాక్కవుతున్నారు. ఒక్క సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలు వెయిట్ చేసి, మధ్యలో వచ్చిన అవకాశాలను కూడా వదులుకున్నడంటే.. హనుమాన్ సినిమాపై, ప్రశాంత్ వర్మపై తేజకు ఉన్న నమ్మకం. ఆ నమ్మకమే ఇప్పుడు నిజమై భారీ విజయాన్ని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని, ఎంతో గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టింది. మరోవైపు చిన్న హీరోకు రెండు సంవత్సరాల్లో 75 స్టోరీలు వచ్చాయా అని సెటైర్లు వేస్తున్నారు.