Bigg Boss Telugu 7 : యూట్యూబర్ గా మంచి పాపులారిటీ ని సంపాదించుకొని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన టేస్టీ తేజా, ఈ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన అయ్యాడు. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి టాస్కుల విషయం లో పెద్దగా ఆడకపోయినా కూడా, తనకి తెలిసిన విధానం లో ఎంటర్టైన్మెంట్ ని పంచుతూ వచ్చాడు. ఇతనిని చూసిన ప్రతీ ఒక్కరికి మన స్నేహితుల గ్యాంగ్ లో సరదాగా ఫన్ చేసే దోస్తులు గుర్తుకు వస్తారు.

అలా అందరికీ దగ్గరయ్యాడు కాబట్టే ఒక్క టాస్కు కూడా సరిగా ఆడకపోయినా ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాడు. టైటిల్ ని కొట్టడం ఒక్కటే లక్ష్యం కాదు, ఇలా పాపులారిటీ ని దక్కించుకోవడం ఒక అదృష్టం అనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు టేస్టీ తేజా కేవలం సోషల్ మీడియా లో కొంతమందికి మాత్రమే సుపరిచితం.

కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. మనోడిలో ఉన్న కామెడీ టైమింగ్ ని చూసి దర్శక నిర్మాతలు కచ్చితంగా సినిమాల్లో అవకాశాలు కూడా ఇవ్వొచ్చు. అతని యూట్యూబ్ ఛానల్ లోని వీడియోస్ కి ఇంతకు ముందు కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ వ్యూస్ మరియు సంపాదన కూడా రావొచ్చు.

ఇదంతా పక్కన పెడితే 9 వారాలు తేజా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగినందుకు ఆయనకీ బిగ్ బాస్ యాజమాన్యం దాదాపుగా 10 లక్షల రూపాయిల చెక్ ఇచ్చినట్టు సమాచారం. తేజా లాంటి ఒక సాధారణ యూట్యూబర్ కి 63 రోజుల్లో ఇంత సంపాదన అనేది మామూలు విషయం కాదు. హౌస్ లో ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారిలో అత్యధిక పారితోషికం తీసుకున్న కంటెస్టెంట్స్ లో టేస్టీ తేజా ఒకడు అట. చూడాలి మరి రాబొయ్యే ఇతని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది.
