‘బుట్టబొమ్మ’ పాటకి తమిళ హీరో విజయ్ అదిరిపోయే రేంజ్ స్టెప్పులు.. వీడియో వైరల్

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద 160 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా రికార్డ్స్ ని ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ముట్టుకోలేకపొయ్యారు.

విజయ్
విజయ్

దాదాపుగా స్టార్ హీరోలందరూ కూడా సూపర్ హిట్స్ కొట్టారు కానీ, ఒక్కరు కూడా ఈ సినిమాకి దగ్గర్లో రాలేకపోయారంటే, ఈ చిత్రం ఏ రేంజ్ సెన్సేషన్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఆ రేంజ్ లో హిట్ అవ్వడానికి ప్రధాన కారణం పాటలు. తమన్ అందించిన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. అందులో ముఖ్యంగా ‘బుట్ట బొమ్మ’ సాంగ్ గురించి చెప్పుకోవాలి. అప్పట్లో టిక్ టాక్ ఉండేది, అందులో ఈ పాట మీద నెటిజెన్స్ మిలియన్ల కొద్దీ వీడియోస్ చేసి తరచూ అప్లోడ్ చేస్తూ ఉండేవాళ్ళు.

పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం ఈ పాటకి డ్యాన్స్ వేస్తూ రీల్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ వంతు వచ్చింది. ఆయన గత ఏడాది బీస్ట్ అనే చిత్రం లో హీరో గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయిన కూడా కలెక్షన్స్ పరంగా యావరేజి అని అనిపించుకుంది.

- Advertisement -

ఈ సినిమాలో కూడా ‘అలా వైకుంఠపురం లో’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే నే హీరోయిన్ గా నటించింది. షూటింగ్ గ్యాప్ లో ఆమె విజయ్ తో కలిసి ‘బుట్టబొమ్మ’ స్టెప్పులు వేసింది. విజయ్ మరియు పూజ హెగ్డే తో పాటు ఇద్దరు చిన్న పిల్లలు కూడా డ్యాన్స్ వేశారు. తమిళనాడు లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న విజయ్ అల్లు అర్జున్ పాటకి డ్యాన్స్ వెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here