టాలీవుడ్ లో ఒకప్పుడు ఊపేసింది తమన్నా భాటియా. ఇప్పుడు బాలీవుడ్ తోపాటు వెబ్ సిరీస్ లతోనూ బిజీ అయింది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత తన హాట్ అందాలతోనే కాదు బోల్డ్ సీన్లలోనూ నటిస్తూ రెచ్చిపోతోంది. తాజాగా రిలీజైన జీ కర్దా సిరీస్ ట్రైలర్ లోనూ కొన్ని బోల్డ్ సీన్లలో తమన్నా నటించడం చూడొచ్చు. ట్రైలర్ లోనే అలా ఉంటే ఇక మొత్తం వెబ్ సిరీస్ ఎలా ఉందో అని అందరూ అనుకుంటున్నారు.

జూన్ 15 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అరునిమా శర్మ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ని మద్ధోక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మించారు. ఇక ఈరోజు ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ప్రకారం ఓ ఏడుగురు స్నేహితులు తమకి 30 ఏళ్ల వయసు వచ్చినప్పుడు తమ జీవితాలు ఓ కొలిక్కి వస్తాయని అనుకుంటారు. కానీ తమకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత తాము అనుకున్న దానికి భిన్నంగా జీవితం ఉందని గ్రహిస్తారు.

ఈ ట్రైలర్ లో తమన్నా కొన్నిసె** సీన్లలో బోల్డ్ గా నటించింది. తమన్నాతోపాటు ఆషిమ్ గులాటి, సుహైల్ నయ్యర్, అన్యా సింగ్, హుస్సేన్ దలాల్, సయన్ బెనర్జీ, సంవేదనా సువాల్కా ఇందులో నటించారు. ఈ సిరీస్ లో లావణ్య అనే పాత్రలో తమన్నా కనిపిస్తోంది. జీ కర్దా సిరీస్ లో నటించడం తనకు చాలా బాగా అనిపించిందిన ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తమన్నా చెప్పింది. ఇందులో తన పాత్రది కూడా అచ్చూ తనలాంటి మనస్తత్వమే అని చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ కు ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే కేవలం అడల్ట్స్ కోసమే. స్నేహం, ప్రేమ మధ్య ఉన్న తేడాను సరిగా అర్థం చేసుకోకుండా ఏడడుగుల బంధంలోకి అడుగుపెడితే ఎదురయ్యే ఇబ్బందులను ఈ సిరీస్ లో చూపించే ప్రయత్నం చేశారు.