మన టాలీవుడ్ లో ఒక ఆర్టిస్టు చెయ్యాల్సిన సినిమా మరొకరు చెయ్యడం, ఆ సినిమా హిట్ లేదా ఫట్ అవ్వడం వాటికి జరుగుతూనే ఉంటాయి. అయితే హిట్ అయ్యినప్పుడు మాత్రం అబ్బా ఎలాంటి సినిమాని మిస్ అయ్యానో అని సదరు ఆర్టిస్టుకి అనిపించడం సర్వసాధారణం. అలా ప్రముఖ స్టార్ హీరోయిన్ తమన్నా విషయం లో జరిగింది. రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన ‘జైలర్’ మరియు ‘భోళా శంకర్ ‘ చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ లో విడుదలయ్యాయి.

అంటే సౌత్ లో ఇప్పుడు ఏ థియేటర్ కి వెళ్లినా మనం తమన్నా ని స్క్రీన్ మీద చూడాలి అన్నమాట. ఈ రెండు సినిమాల ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూస్ ని ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూస్ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఇక అసలు విషయానికి వస్తే 2010 వ సంవత్సరం లో ప్రభాస్ హీరో గా నటించిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘డార్లింగ్ ‘ చిత్రం విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇందులో ప్రభాస్ కి ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో, హీరోయిన్ గా చేసిన కాజల్ అగర్వాల్ కి కూడా అంతే మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. చాలా క్యూట్ గా బబ్లీ గా ఇందులో కాజల్ కనిపిస్తుంది.

ఈ సినిమా అంటే తమన్నా కి ఎంతో ఇష్టమట. అయితే తొలుత ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఆమెకే దక్కింది అట. కానీ అప్పుడు ఆమె వేరే సినిమాతో బిజీ గా ఉండడం వల్ల డేట్స్ ని కేటాయించలేకపోయింది. ఫలితంగా ఈ చిత్రం ఆమె చేతి నుండి జారిపోయింది. ఆ తర్వాత సినిమా విడుదల అయ్యాక అందులో హీరోయిన్ క్యారక్టర్ ని చూసి ఎంత మంచి పాత్రని మిస్ అయ్యానో అని తమన్నా కన్నీళ్లు పెట్టుకుందట. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే చెప్పింది .
