తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఇటీవలే ఆ ఇద్దరు కన్ఫర్మ్ చేశారు. వీరిద్దరూ కలిసి ఇటీవల లస్ట్ స్టోరీస్ లో నటించారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని ఈవెంట్స్ కి, బాలీవుడ్ పార్టీలకు తెగ తిరిగేస్తున్నారు. అయితే తాజగా విజయ్ వర్మకు అలియాభట్ తో పెళ్లి అయిపోయినట్టు ఓ ఫోటో వైరల్ అయింది. విజయ్ వర్మకు ఇదివరకే పెళ్లయిందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌తో విజయ్ వర్మ పెళ్లి ఫోటో తన ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకున్నాడంటూ ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. దీనిపై రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

దీనిపై విజయ్ వర్మ స్పందించాడు.. “అది నేను, అలియాభట్ డార్లింగ్స్ సినిమా సమయంలో దిగిన ఫోటో. మేకర్స్ మా ఇద్దరికీ పెళ్లి చేసి ఆ ఫోటో తీశారు. ఇది మొత్తం సినిమాలో భాగమే. దీన్ని ఎవరూ తప్పు పట్టవద్దు” అని స్పష్టం చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ గా మారింది. కానీ విజయ్ వర్మ రిప్లై ఇవ్వడంతో, ఈ ఫోటోపై తమన్నా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమన్నాను రెండో పెళ్లి చేసుకుంటున్నారా..? సిగ్గు లేదా..? అంటూ ఘాటుగా స్పందించాడు. ఇంత నష్టం జరిగినా విజయ్ వర్మ క్లారిటీ వల్ల ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా పేరు ఏ రేంజ్ లో మారుమోగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌లో తమన్నా బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తుంది, ఇది అభిమానులకు నచ్చడం లేదు.
