Tamannaah Bhatia : సన్యాసం పుచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. షాక్ లో ఫ్యాన్స్.. నిన్నిలా చూడాలేకపోతున్నామంటూ కామెంట్స్

- Advertisement -


Tamannaah Bhatia : స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మకు గ్లామర్ గాళ్ ఇమేజ్ ఉంది. గత సంవత్సరం ‘లస్ట్ స్టోరీస్ 2’, జీ కర్ధా అనే వెబ్ సిరీసుల్లో హాట్ హాట్ అందాలను బీభత్సంగా ఆరబోశారు. అంతకు ముందు కొన్ని సినిమాల్లో కూడా గ్లామర్ ఒలకబోశారు. ‘గుర్తుందా శీతాకాలం’, ‘బబ్లీ బౌన్సర్’ సినిమాల్లో డిఫరెంట్ & యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ చేశారు. ‘బాహుబలి’లో యుద్ధ సన్నివేశాల్లో నటించారు. కమర్షియల్ కథానాయికగానూ, నటిగానూ తమన్నా తనను తాను ఎప్పటికప్పుడూ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. అయితే… ఆమెను మిల్కీ బ్యూటీగా చూసే ప్రేక్షకులే ఎక్కువ. అటువంటి ఆమె జనాలకు షాక్ ఇచ్చేలా కొత్త సినిమా ‘ఓదెల 2’లో డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన ఫోటోలు చూస్తే మీరూ ఆ మాటే అంటారు.

Tamannaah Bhatia

ఇది ఇలా ఉంటే.. గత రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన సంచలన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఓదెల రైల్వే స్టేషన్’. అశోక్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ప్రధాన పాత్రలో నటించారు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ ‘ఓదెల 2’ రాబోతుంది. ఇందులో తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తుండగా ఈసారి ఈ మూవీని థియేటర్లలో, వివిధ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

tamanna
tamanna

మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌ వర్క్స్ సంస్థలపై డి మధు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కాగా కాశీలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అయితే ఇక ఇప్పటి వరకు ఈ మూవీ నుండి ఎలాంటి అప్ డేట్ రివీల్ చేయనన్నటికి, తాజాగా చిత్రీకరణ చేస్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజెంట్ ఆ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా ఈ ఫోటోలలో తమన్నా చుట్టూ అఘోరాల మధ్యలో కూర్చుంది. చీర కట్టు బొట్టుతో ఎంతో పద్ధతిగా కనపడింది. చూస్తుంటే మూవీని గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here