తమన్నా : స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా సీక్రెట్ గా డేటింగ్ లో ఉందంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. నాని నటించిన ‘ఎంసీఏ’లో విలన్ గా మెప్పించిన విజయ్ వర్మ (Vijay Varma)తోనే ప్రేమలో ఉందంటూ పుకార్లు వచ్చాయి. అయితే మిల్క్ బ్యూటీని వాటిని నిజం చేస్తూనే ఉంది. గతంలో తమన్నా భాటియా (Tamannaah Bhatia) పెళ్లి గురించి వార్తలు వచ్చిన, ప్రశ్నలు ఎదురైనా వాటిని కొట్టిపారేస్తూ వచ్చింది. దీంతో మిల్క్ బ్యూటీ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందా? అని అందరూ ఆసక్తిగా చూశారు. పెళ్లి వార్తనే ఎత్తనివ్వని ఈ బ్యూటీ ప్రస్తుతం డేటింగ్ లో మునిగితేలుతోంది.

తాజాగా తనని బాయ్ ఫ్రెండ్ ఏమని పిలుస్తాడో చెప్పి అందరినీ షాక్ కు గురిచేసింది. వాలైంటెన్స్ డే రోజు విషెస్.. గోవాలో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో విజయ్ వర్మతో సందడి చేయడం వంటివి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రూమర్స్ కాస్తా నిజాలుగా మారాయని అంటున్నారు నెటిజన్స్. ఇక అది అలా ఉంటే తమన్నాను విజయ్ ముద్దుగా తమటార్ అని పిలుస్తాడట.. ఇదేం పేరని ఛీ అని అంటున్నారు ఫ్యాన్స్. తాజాగా తమన్నా – విజయ్ వర్మ ముంబైలో ఓకే కారులో కనిపించారు. డిన్నర్ డేట్ కు బయల్దేరి వీరు కెమెరా కంటికి చిక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్లు వస్తున్నా క్రమంలో మళ్లీ మళ్లీ జంటగా కనిపించి ఆకట్టుకుంటున్నారు.

ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన తమన్నా ఈ వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మేమిద్దరం కలిసి ఒక సినిమా చేశాం. అప్పటి నుంచి మా బంధంపై రకరకాల వార్తలు పుట్టించారు. ఇలాంటి వాటిపై స్పందించాల్సిన అవసరం నాకు లేదు. ఇంతకు మించి వీటిపై నేనేమీ సమాధానం చెప్పను. నటీనటులకు నిజంగా పెళ్లి జరిగే సమయానికి సోషల్‌మీడియాలో చాలా పెళ్లిళ్లు చేసేస్తారు. ప్రతి శుక్రవారం మాకో పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత ‘అయ్యో మీకు పెళ్లి జరగలేదా’ అంటారు’’ అని తమన్నా వ్యంగ్యంగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ (Bhola Shankar)లో నటిస్తోంది. అలాగే రజనీకాంత్ ‘జైలర్’ (Jailer)లో కనిపించనుంది, వీటితోపాటు ‘అరణ్మయై4’ ‘బోలే చుడియన్’లో నటిస్తోంది. సినిమాల్లోనే కాకుండా వెబ్‌సిరీసులతోనూ సందడి చేయనుంది.