మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia), హైదరాబాదీ యువకుడు విజయ్ వర్మ (Vijay Varma) ప్రేమలో ఉన్నారు. అయితే, ఆ విషయాన్ని వాళ్లిద్దరూ ఎప్పుడూ నోరు తెరిచి చెప్పలేదు. తొలుత గుట్టుగా ఉంచారు. కానీ, ఇప్పుడు తమ చేతల ద్వారా ప్రేమలో ఉన్నట్లు హింట్ ఇస్తూ ఉన్నారు. రహస్యంగా కలవకుండా మీడియాకు కనపడేలా షికార్లు చేస్తున్నారు.

విజయ్ వర్మది హైదరాబాద్ అయినప్పటికీ ఆయన ముంబైలోనే ఉంటున్నారు. అటు తమన్నా పంజాబీ అమ్మాయి అయినా సరే పుట్టిందీ, పెరిగిందీ, అంతా ఆ నగరంలోనే! ఇద్దరూ ముంబైలో సోమవారం కలిశారు. ఓ రెస్టారెంట్ లో డిన్నర్ చేసిన తర్వాత, తమన్నా కారు ఎక్కుతున్న సమయంలో మీడియా కంట పడ్డారు. వీడియోలు, ఫోటోలు తీస్తుంటే హాయ్ చెప్పారు. సో తమ ప్రేమ విషయాన్ని ఈ జంట ఇప్పుడు దాచాలని అనుకోవడం లేదన్నమాట. ఇంత వరకు బాగానే ఉన్నా తాజాగా ఓ వార్త తమన్నా అభిమానులు కొందరు కూడా ఆమెను అసహ్యించుకునేలా చేస్తోంది.

విజయ్ వర్మ తమన్నా కంటే చాలా పెద్దవాడట. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమెతో పోలిస్తే ముసలివాడట. ప్రస్తుతం ఈ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ విషయం తెలిసిన కొంతమంది నెటిజన్స్ అయితే తమన్నా (Thamannah) పై చాలా వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ అసలు విషయం ఏంటో తెలియకుండా ఇలా మా హీరోయిన్ గురించి దుష్ప్రచారం చేయడం ఏమీ బాగాలేదని తమన్నా అభిమానులు బాధపడుతున్నారు.ఇక తమన్నా తెలుగులో చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన జైలర్ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తుంది.