ఇటీవల విడుదలైన ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌లతో ట్రెండింగ్‌లో ఉంది తమన్నా. హద్దులు దాటి శృంగార సన్నివేశాల్లో నటించిన తమన్నాను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసిన తమన్నా పేరే వినిపిస్తోంది. దానికి తోడు బాయ్‌ఫ్రెండ్ గురించి రివీల్ చేయడం కూడా హాట్ టాపిక్‌గా మారింది.ప్రస్తుతం తమన్నా ఈ సిరీస్‌లను ప్రమోట్ చేసే పనిలో ఉంది. ఈ సందర్భంలోనే తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘‘విజయ్ వర్మ లాంటి వ్యక్తి నా జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నా. నా భావాలను గౌరవించే వ్యక్తి అతను. అతడి జీవితాన్ని ఎంతోమంది మహిళలు ప్రభావితం చేసుంటారు. తన కుటుంబంలోని స్ర్తీలపై ఎంతో ప్రేమాభిమానాలు చూపుతాడు. ఇంట్లో వారిపై గౌరవంగా ఉండేవారు బయట మహిళలతో కూడా మర్యాదగా వ్యవహరిస్తారని నా నమ్మకం. ఇది ఇప్పటి యువత నేర్చుకోవాలి. స్ర్తీలతో ఎలా మెలగాలో తల్లిదండ్రులు వారి కుమారులకు నేర్పాలి. మహిళలు ప్రతి విషయంలో రాజీపడాలనే భావనను నేను అంగీకరించను. విజయ్ నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. అందుకే తను నా మనసుకు దగ్గరయ్యాడు’’ అని తమన్నా చెప్పింది.
ప్రస్తుతం సోషల్‌మీడియా వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు నటి తమన్నా. ఆయా సిరీస్‌ల్లో ఆమె బోల్డ్ సీన్స్‌లో నటించడమే ఈ వ్యతిరేకతకు కారణం. ఈ విమర్శలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడారు. హీరోలు బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తే ఎవరూ విమర్శలు చేయరని.. నటీమణులు చేస్తే మాత్రం ఇంతటి వ్యతిరేకత ఎందుకు వస్తుందో తనకు అర్థం కావడం లేదని ఆమె అన్నారు. ‘‘ప్రస్తుతం ఉన్న యుగంలో ఇలాంటి వ్యతిరేకత వస్తుందని నేనస్సలు అనుకోలేదు. కొంతమంది పురుషులు సామాజిక మాధ్యమాల వేదికగా నాపై ఇలాంటి విమర్శలు చేయడం చూస్తుంటే వింతగా ఉంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. కెరీర్ మొదలైన నాటి నుంచి గ్లామర్ పాత్రలు పోషిస్తూనే ఉన్నా. అంతేకానీ, మొదట్లో డీ గ్లామర్ రోల్స్ చేసి.. సడెన్‌గా ఇలాంటి ప్రాజెక్ట్స్‌లోకి అడుగుపెట్టలేదు. ఈ 18 ఏళ్ల కెరీర్‌లో కొన్ని రూల్స్ పాటించా. నో కిస్ పాలసీ కూడా నా కాంట్రాక్ట్‌లో ఉంటుంది. అయితే, కెరీర్‌పరంగా వృద్ధి చెందాలంటే మారాలనే భావనతోనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లు చేశా’’ అని తమన్నా వివరించారు.