నా వెబ్ సిరీస్ లో కామం మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి..: తమన్నా

- Advertisement -

తమన్నా ఈ మధ్య వెబ్ సిరీస్ లలో రెచ్చిపోయి సె*క్స్ సీన్లలో నటిస్తున్న సంగతి తెలుసు కదా. ప్రైమ్ వీడియోలో వచ్చిన జీ కర్దా వెబ్ సిరీస్ లో అలాంటి ఎన్నో సీన్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు లస్ట్ స్టోరీస్ 2లోనూ తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో అలాంటి సీన్లలో చెలరేగిపోయింది. తాజాగా అలాంటి ఓ వీడియోనే ఆమె షేర్ చేస్తూ.. లస్ట్ స్టోరీస 2 చూసేటప్పుడు ఎవరైనా సడెన్ గా వస్తే భయపడిపోయి తీసేయకండి అని చెప్పడం విశేషం.

తమన్నా
తమన్నా

ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా తమన్నా ఈ వీడియో చేసింది. లస్ట్ అంటే కామం. అయితే ఈ సిరీస్ లో కామం ఒక్కటే కాదు.. ఇంకా చాలా ఉన్నాయ్.. ఫ్యామిలీతో కలిసి చూడండని తమన్నా చెబుతోంది. “లస్ట్ స్టోరీస్ 2లో డ్రామా, రొమాన్స్, యాక్షన్ ఉన్నాయి. ఇందులో అమ్మ ప్రేమ, బామ్మ ప్రేమ, మాజీ లవర్ ప్రేమ, పని మనిషి ప్రేమ కూడా ఉన్నాయి. పేరు చూసి మోసపోకండి. అందరికీ చూపించండి. ఏమవుతుంది? తుఫానేమీ రాదు. ఆకాశం ఊడిపడదు. వైఫై బంద్ కాదు. కదా? రిలాక్స్ అవండి. లస్ట్ స్టోరీస్ 2 చూడండి” అని ఈ సిరీస్ ప్రోమోలో తమన్నా చెప్పింది.

tamanna
tamanna

ఇక ఈ యూత్‌ఫుల్‌, రొమాంటిక్‌ డ్రామాలో భాగంగా నటుడు, తన ప్రియుడు విజయ్‌ వర్మ (Vijay Varma)తో తమన్నా ఆన్‌స్క్రీన్‌పై ముద్దు సన్నివేశాల్లో కనిపించింది. దీని కోసం సుమారు 18 ఏళ్ల నుంచి తాను ఫాలో అవుతోన్న నో కిస్‌ పాలసీని బ్రేక్‌ చేసింది. దీనిపై మాట్లాడుతూ కాలానుగుణంగా మారే వ్యక్తుల్లో తాను ఒకదాన్నని పేర్కొంది. ఒక నటిగా సృజనాత్మకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్ల తర్వాత ఫేమస్‌ అవ్వాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. 2018లో విడుదలై, విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న వెబ్‌ సిరీస్‌ల్లో ‘లస్ట్‌ స్టోరీస్‌’ ఒకటి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘లస్ట్‌స్టోరీస్‌ 2’ వస్తోంది. కాజోల్‌, తమన్నా, మృణాల్‌ ఠాకూర్‌, విజయ్‌ వర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here