Mahesh Babu : సోషల్ మీడియా లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ మొదటి నుండి ఒక రేంజ్ లో ట్రోలింగ్ చేస్తూ వస్తున్నారు. పెద్ద ఎత్తున ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రోలింగ్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. థమన్ కూడా వాళ్లకి పరోక్షంగా సెటైర్లు వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఓపెన్ గానే రెస్పాన్స్ ఇచ్చాడు.

రీసెంట్ గా ఆయన సంగీతం లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్ళడానికి కారణం థమన్ అందించిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురిసింది. అప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ మా సినిమాలకు తప్ప ప్రతీ ఒక్కరికి బాగానే కొడుతావ్, మేమేమి పాపం చేసాము అంటూ థమన్ ని ట్యాగ్ చేసి పోస్టులు పెట్టారు.

దీనికి థమన్ రీసెంట్ గా ఆయన ఇచ్చిన భగవంత్ కేసరి మూవీ ఇంటర్వ్యూస్ లో చాలా కోపంగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో వచ్చే ట్రోల్ల్స్ ని నేను గమనిస్తూనే ఉన్నాను. సినిమాలో విషయం ఉంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో ఇవ్వగలను. విషయం లేని సినిమాలకు , సన్నివేశాలకు నేనేమి చెయ్యగలను రా బాబు..అప్పటికీ నేను నా నుండి బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను, నచ్చకపోతే మీ ఖర్మ’ అంటూ సమాధానం ఇచ్చాడు.

థమన్ కోపం గా మాట్లాడిన ఈ మాటలు చూసి పక్కనే ఉన్న బాలయ్య బాబు కూడా షాక్ అవుతాడు. థమన్ చేసిన ఈ కామెంట్స్ పై మహేష్ ఫ్యాన్స్ మరోసారి విరుచుకుపడ్డారు. విషయం లేని సన్నివేశాలను లేపేది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కదా, రీసెంట్ గా విడుదలైన జైలర్ చిత్రం యావరేజి కంటెంట్ ఉన్నప్పటికీ అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. అందుకు కారణం ఆ సినిమాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా సన్నివేశాల్లో అలా లేపింది. నీకు చేత కాలేదని చెప్పు అంటూ కామెంట్స్ చేసారు.
