Taapsee Pannu : చీరకట్టులో దిల్లీ డాల్ వయ్యారాలు.. నడుం వొంపు చూపిస్తూ టెంప్టింగ్ పోజులు

- Advertisement -

Taapsee Pannu: తాప్సీ పన్ను ఈ సొట్టబుగ్గల చిన్నది ఝుమ్మందినాదం అనే సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఈ బ్యూటీ అందానికి మెచ్చిన తెలుగు ప్రేక్షకులు ఈ భామపై తెగ ప్రేమను కురిపించేశారు. ఇక ఆ తర్వాత తాప్సీకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఎక్కువగా ఒకేలాంటి పాత్రలు రావడంతో తాప్సీకి విసుగొచ్చింది. కాస్త ఛేంజ్​కోసం బాలీవుడ్​కు వెళ్దామని ట్రై చేసింది. ఈ బ్యూటీకి బీ టౌన్ గోల్డెన్ కార్పెట్​తో గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పింది. తాప్సీ బాలీవుడ్​కు వెళ్లగానే హీరోయిన్ ఓరియెంటెడ్ స్క్రిప్టులతో ముంబయి వెల్​కమ్ చెప్పింది.

Taapsee Pannu
Taapsee Pannu

తాప్సీ బాలీవుడ్​లో బేబీ, నామ్ షబానా, ముల్క్, తప్పడ్, బద్లా, పింక్, శెభాష్ మిథు, దోబారా, బ్లర్, హసీన్ దిల్ రుబా.. ఇలా పట్టిందల్లా బంగారమే అన్నట్టు నటించిన ప్రతి సినిమా హిట్ అవ్వడమే కాదు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఈ బ్యూటీ సెలెక్టివ్​గా స్క్రిప్టులు ఎంచుకుంటూ బీ టౌన్​లో తిరుగులేని స్టార్​గా ఎదిగింది. ఈ భామ నటనకు బాలీవుడ్ కింగ్.. షారుఖ్ ఖాన్ ఫిదా అయ్యారు. ఈ ఇద్దరూ జంటగా దున్కీ అనే సినిమాలో నటిస్తున్నారు.

Taapsee

ఈ దిల్లీ డాల్ సోషల్ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పుడూ తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోషూట్​కు సంబంధించి ఫొటోలు పోస్టు చేసింది. ఈ ఫొటోల్లో తాప్సీని ఎన్నడూ చూడని అవతార్​లో ప్రేక్షకులు చూశారు. గ్రీన్ కలర్ చీరలో తాప్సీ చాలా అందంగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజులో.. తలలో గులాబీ పువ్వు పెట్టుకుని మల్లెతీగ లాంటి అందంతో మెస్మరైజ్ చేసింది. నడుం వొంపులు చూపిస్తూ తాప్సీ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది.

- Advertisement -
Pannu

చీరకట్టులో తాప్సీని చూసిన కుర్రాళ్ల గుండె జారి గల్లంతైంది. ఇంత వయ్యారంగా ఈ భామను ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంత అందం, టాలెంట్​ బాలీవుడ్​కి వెళ్లిపోయిందని ఫీల్ అవుతున్నారు. హేయ్ దిల్లీ డాల్.. త్వరగా టాలీవుడ్​కు వచ్చేసేయ్ అంటూ సోషల్ మీడియాలో తెగ రిక్వెస్టులు పెడుతున్నారు. అయితే తాప్సీ ఈ న్యూలుక్ తన నెక్స్ట్ మూవీ హసీన్ దిల్ రుబా సీక్వెల్​కు సంబంధించినది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here