టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేసి.. ఆ ఇమేజ్ ను సంపాదించుకోలేక తర్వాత కోలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుని విఫలమైంది తాప్సీ. దీంతో ఈ ఢిల్లీ బ్యూటీ.. తన సొంత గడ్డ అయినటువంటి బాలీవుడ్ కి చెక్కేసింది.అక్కడ మాత్రం ఈమె టార్గెట్ మిస్ అవ్వలేదు. అక్కడ తాప్సీ చేసిన ఉమెన్ సెంట్రిక్ చాలా వరకు సక్సెస్ అయ్యాయి.బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు కురిపించింది. ఓటీటీ కోసం కూడా తాప్సీ పలు క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది. అయితే చాలాకాలం తర్వాత సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు నటి తాప్సీ పన్నూ.Taaapsee : టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేసి.. ఆ ఇమేజ్ ను సంపాదించుకోలేక తర్వాత కోలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుని విఫలమైంది తాప్సీ. దీంతో ఈ ఢిల్లీ బ్యూటీ.. తన సొంత గడ్డ అయినటువంటి బాలీవుడ్ కి చెక్కేసింది.అక్కడ మాత్రం ఈమె టార్గెట్ మిస్ అవ్వలేదు. అక్కడ తాప్సీ చేసిన ఉమెన్ సెంట్రిక్ చాలా వరకు సక్సెస్ అయ్యాయి.బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు కురిపించింది. ఓటీటీ కోసం కూడా తాప్సీ పలు క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది. అయితే చాలాకాలం తర్వాత సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు నటి తాప్సీ పన్నూ.

ప్రస్తుతం ‘డంకీ’, ‘ఏలియన్’ సినిమాల్లో నటిస్తోన్న ఆమె తాజాగా ఇన్‌స్టా వేదికగా చిట్‌చాట్ నిర్వహించారు. పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా బదులిచ్చారు. ఈ క్రమంలోనే తన పెళ్లిపై ఆమె వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. తర్వాత హాలిడే స్పాట్ కు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారని అడగ్గా.. నేను ఎక్కువ సమయం విహారయాత్రల్లోనే ఉంటూ తక్కువగా వర్క్ చేస్తున్నాననిపిస్తుంది (నవ్వులు). టూర్ కోసం నెక్స్ట్ ఎక్కడికి వెళ్లాలనే దానిపై నేనింకా ప్లాన్ చేసుకోలేదు. ప్రస్తుతం చేస్తోన్న సినిమా షూట్ పూర్తైయ్యాక వెకేషన్ ఎక్కడికనేది డిసైడ్ అవుతా. అప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వెళ్తా.. అని చెప్పింది.

ఈ మధ్యకాలంలో ఎందుకని మీరు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండడంలేదని మరొకరు అడగ్గా.. నేను సోషల్‌మీడియాలోకి అడుగుపెట్టినప్పుడు అందరితో సత్సంబంధాలు పెంచుకోవడానికి ఇదొక మీడియంలా ఉండేది. సానుకూల వాతావరణం కనిపించేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎదుటి వ్యక్తిని దూషించడానికి, కిందకు లాగడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. అది నాకు నచ్చడం లేదు. అని సమాధానం చెప్పింది. మరొక అభిమాని మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించగా.. నేనింకా ప్రెగ్నెంట్ కాలేదు. కాబట్టి, అతి త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.