Nandita Swetha : సమంతలా వింత వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్..

- Advertisement -

Nandita Swetha : సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌టానికి క‌థానాయిక‌లు ప‌డే క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. శారీర‌క‌, మాన‌సిక స‌మ‌స్య‌లు ఉన్నప్ప‌టికీ వాటిని బ‌య‌ట పెట్ట‌కుండా మెనేజ్ చేస్తుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో వారు త‌మ ఇబ్బందుల‌ను చెప్పిన‌ప్పుడు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతుంటారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ హీరోయిన్ స‌మంత‌. ఆమె మయోసైటిస్‌తో బాధ‌పడుతున్న సంగ‌తి తెలిసిందే. దీని వ‌ల్ల ఆమె కెరీర్ ఎంతో ఎఫెక్ట్ అయ్యింది.

Nandita Swetha
Nandita Swetha

తాజాగా ఇలా ఆరోగ్య స‌మ‌స్య‌తో బాధ‌పడుతూ మ‌రో హీరోయిన్ లిస్టులో చేరింది. ఆమె ఎవ‌రో కాదు..నందితా శ్వేత‌. ఓ వైపు తెలుగు, మ‌రో వైపు త‌మిళ సినిమాలు చేస్తున్న నందితా శ్వేత ఇప్పుడు హిడింబ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. గ‌త చిత్రాల‌కు భిన్నంగా ఈ మూవీలో ఆమె గ్లామ‌ర్ డోసును పెంచింద‌ని ఓ పాట‌లో క్లియ‌ర్ క‌ట్‌గా అర్థ‌మ‌వుతుంది. జూలై 20న రిలీజ్‌కి సిద్ధ‌మైన ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో టీమ్ ఫుల్ బిజీగా ఉంది. ఈ నేప‌థ్యంలో నందితా శ్వేత త‌న ఆరోగ్య స‌మ‌స్య‌ను బ‌య‌ట పెట్టింది.

నందితా శ్వేత‌

ఫైబ్రో మ‌యాల్జియా (Fibro Myalgia) అనే హెల్త్ ప్రాబ్ల‌మ్‌తో నందితా శ్వేత ఇబ్బందిప‌డుతోంది. వెన్నెముక‌, కండరాల‌కు సంబంధించిన వ్యాధి. స‌డెన్‌గా నీర‌సం వ‌చ్చేయ‌టం, మెద‌డు నొప్పిని గ్ర‌హించ‌లేక‌పోవ‌టం వంటికి ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు. ఫైబ్రోమయాల్జియాతో బాధ‌ప‌డుతున్న‌వారు ఎక్స‌ర్‌సైజులు చేయ‌కూడ‌దు. అయితే హిడింబ సినిమా (Hidimba movie) కోసం నందితా శ్వేత ఎక్స‌ర్‌సైజులు చేసి మ‌రీ బ‌రువు త‌గ్గింది. ఈ సినిమా కోసం రెండు సంవ‌త్స‌రాలు ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని చెప్పుకొచ్చింది నందితా శ్వేత‌. క్రైమ్ థ్రిల్ల‌ర్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కిన హిడింబ జూలై 20న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here