Sushmitha : ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో కొనసాగడం అంత సులభం కాదని అగ్ర కథానాయకుడు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక్కడ ప్రతిరోజూ ఒక పోరాటంలా ఉంటుందని అన్నారు. పరిశ్రమపై ప్రేమ, ఇక్కడ వర్క్‌ను ఎంజాయ్ చేసినప్పుడే ముందుకు వెళ్లగలమని.. కేవలం, గ్లామర్ కోసమే ఇక్కడ ఉండాలనుకుంటే కష్టమేనని పేర్కొన్నారు.

అనంతరం తన తండ్రి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించడంపై మాట్లాడుతూ.. ‘‘సైరా’ నుంచి నాన్న సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నా. ఆయన పోషించే పాత్ర.. ఆయనకున్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటా. స్టైలింగ్ విషయంలో ఆయన కచ్చితంగా ఉంటారు. ఏం మాత్రం నచ్చకపోయినా ఓకే చేయరు’’ అని తెలిపారు. ఆన్‌లైన్ నెగెటివిటీపై మాట్లాడుతూ.. ‘‘సోషల్‌మీడియా, కొన్ని వెబ్‌సైట్స్‌లో వచ్చిన వార్తలు చూసి మొదట్లో నేనూ బాధపడేదాన్ని. అయితే, వాటిని వింటూ కూర్చుంటే ముందుకు సాగలేం. కాబట్టి, బయటవాళ్ల మాటలు పట్టించుకోకుండా కేవలం మనం చేస్తున్న పనిపై దృష్టి పెట్టి ముందుకు సాగితే నెగెటివిటీకి బాధపడం’’ అని వివరించారు.

మొత్తం సినిమా నిర్మాణ వ్యయాన్ని కవర్ చేస్తూనే.. లాభాలలో సగం పంచుకునేలా సుస్మితకు ఆ ప్రొడక్షన్ హౌజ్ ఓ ఆఫర్ కూడా చేసినట్టు వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. అంతా పర్ ఫెక్ట్ గా సాగుతుందనే నమ్మకంతో చిరంజీవి కూడా ఈ ఆలోచన పట్ల ఆసక్తి చూపాడట. ఇదిలా ఉంటే సుస్మిత మాత్రం ఈ సినిమా క్రెడిట్ మొత్తాన్ని సోలోగా దక్కించుకోవాలనుకుంటోందని టాక్ నడుస్తోంది. ఈ సినిమా విషయంలో లాభనష్టాల షేరింగ్ లాంటి ఆర్థికపరమైన విషయాల కంటే తన తండ్రితో సినిమా చేయడంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిందట సుస్మిత . దీంతో మేకర్స్ నుంచి వచ్చిన ప్రతిపాదన పెండింగ్ లో పడ్డట్టు చర్చ నడుస్తోంది.