ఈమధ్య కాలం లో కొన్ని రీ రిలీజ్ చిత్రాల కలెక్షన్స్ ని చూసి ట్రేడ్ పండితులకు సైతం ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షాలు కురిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య కి మన టాలీవుడ్ లో ఎప్పటి నుండో అద్భుతమైన మార్కెట్ ఉంది.
ఈమధ్య వరుస ఫ్లాప్ సినిమాలు రావడం తో ఆయన మార్కెట్ దెబ్బ తిన్నింది ఏమో అని ట్రేడ్ తో పాటుగా, సూర్య అభిమానుల్లో కూడా ఒక అనుమానం ఉండేది. కానీ ఆయనకి మరియు ఆయన పాత సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ గా మారింది రీసెంట్ గా విడుదలైన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ అనే చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా రీ రిలీజ్ అయిన ఈ సినిమా కి జనాలు థియేటర్స్ బయట బారులు తీశారు.
తెల్లవారుజామున వేసిన షోస్ ని కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నింపేశారు మన తెలుగు ఆడియన్స్. వాళ్ళ నుండి ఈ అభిమానం ని చూసిన సూర్య కూడా షాక్ కి గురై సోషల్ మీడియా ద్వారా కృతఙ్ఞతలు తెలియచేసాడు. ఈ చిత్రం నాలుగు రోజులకు కలిపి రెండు కోట్ల 60 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇది టాలీవుడ్ లో ఇప్పటి వరకు రీ రిలీజైన టాప్ 5 హైయెస్ట్ గ్రాస్ చిత్రాలలో ఒకటిగా మరికొద్ది రోజుల్లో నిలబడబోతుంది. ఇక వైజాగ్ సిటీ , గాజువాక మరియు కొన్ని కీలకమైన సెంటర్స్ లో పవన్ కళ్యాణ్ ‘ఖుషి‘ మరియు జూనియర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి‘ రీ రిలీజ్ కలెక్షన్స్ ని కూడా దాటేసింది అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంత ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో అనేది.