అంత చూపిస్తోన్నా సురేఖ వాణిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రావట్లేదుట..

- Advertisement -

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ ట్రోలింగ్ కి గురవుతుంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సురేఖ వాణి, సుప్రీత కౌంటర్ ఇవ్వడం జరుగుతూనే ఉంది.

సురేఖ వాణిని
సురేఖ వాణిని

తాజాగా ఆమె పెట్టిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. ప్రస్తుతం ఓ ట్రెండ్ నడుస్తోంది. నరేష్‌ పవిత్రల ఇష్యూ తరువాత అరవై ఏండ్ల వయసులోనూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. మాకు మాత్రం పెళ్లిళ్లు అవ్వడం లేదంటూ సింగిల్స్ బాధలను చూపిస్తూ మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇది కాకుండా తాజాగా టాలీవుడ్ విలన్, కారెక్టర్ ఆర్టిస్ట్ ఆశిష్‌ విద్యార్థి అరవై ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడు. ముప్పై మూడేళ్ల అమ్మాయిని ఆశిష్ విద్యార్థి పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు ట్రోల్స్ మీమ్స్ రీల్స్ ఎక్కువ అయ్యాయి.

మామూలుగానే సురేఖా వాణి సోషల్ మీడియాలో ఇలాంటి మీమ్స్, ట్రోల్స్, ఫన్నీ రీల్స్ పట్ల ఎప్పుడూ స్పందిస్తుంటుంది. పవిత్ర లోకేష్, నరేష్‌ వ్యవహారం, మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్‌లో ఈ జంట చేస్తున్న రచ్చ ఇలా అందరికీ తెలిసిందే. మోస్ట్ ట్రెండింగ్‌ కపుల్స్‌గా నరేష్‌ పవిత్రలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి తోడుగా ఇప్పుడు ఆశిష్‌ విద్యార్థి రెండో పెళ్లి మరింతగా ట్రెండ్ అవుతోంది. ఈ రెండింటిని కలిపి సింగిల్స్‌ బాధలను చూపించేలా ఓ రీల్ వీడియో చేశారు. దీంతో ఇది చూసిన వాళ్లంతా ఎంత చూపించినా నీకు పెళ్లి కావట్లేదా అంటూ జాలిగా కామెంట్స్ పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here