Surekha Vani : సురేఖ వాణి గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు..మొదట యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన సురేఖ వాణి.ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. అయితే జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో సురేఖ వాణి జీవితంలో అనుకోని విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త సురేష్ తేజ గుండె పోటుతో అకస్మాత్తుగా మృతి చెందాడు…ఆ తర్వాత ఒంలోల్ట ఒక్కోరిగా ఉన్న ఈమె రెండో పెళ్లి చేసుకుంటునందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా తనకు కాబోయే వాడి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది..అవి కాస్త నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..
నిజానికి సురేఖ వాణి భర్త కూడా అనేక తెలుగు టీవీ ప్రొగ్రామ్స్, టీవీ షోలకు డైరెక్టర్‌గా పనిచేశారు. సురేఖ టీవీ యాంకర్‌గా ఉన్న సమయంలోనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సురేష్.వీరిద్దరి ఒక కూతురు కూడా ఉంది.. భర్త మరణం తర్వాత సురేఖ కూతురుతో కలిసి ఒంటరిగా ఉంటుంది.. భర్త లేకున్నా కూడా సురేఖ వెనకడుగు వేయలేదు.. సోషల్ మీడియా లో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది..తల్లీకూతుళ్లు ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు..
ముఖ్యంగా చిట్టి పొట్టి దుస్తుల్లో ఇటు తల్లి సురేఖ వాణి, అటు కూతురు సుప్రిత నెట్టింట మంటలు రేపుతుంటారు. సుప్రిత త్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతోంది. ఇక తెరపై ఎంతో పద్ధతిగా కనిపించే సురేఖ.. సోషల్ మీడియాలో మాత్రం యమా హాట్ గా దర్శనమిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే సురేఖ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది..ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సురేఖ రెండో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం పెద్దగా లేదని పేర్కొంది. కానీ ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని ఉందంటూ మనసులో మాట బయట పెట్టి షాక్ ఇచ్చింది. అంతేకాదు, ఆ బాయ్ ఫ్రెండ్ కు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా వివరించింది. గడ్డం పెద్దగా ఉండాలని, ఆస్తులు కూడా బాగా ఉండాలని, తనను అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలని.. అలాంటి మగాడు తనకు బాయ్ ఫ్రెండ్ కావాలంటూ సురేఖ చెప్పుకొచ్చింది.ఇందులో అన్నీ తన సొంత లాభాలే ఉన్నాయని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఇది నెట్టింట వైరల్ అవుతున్నాయి..