Surekha Vani : మీకేం అన్యాయం చేశాను.. నన్నెందుకు వేధిస్తున్నారంటూ గగ్గోలు పెట్టుకున్న సురేఖ వాణి కూతురు..

- Advertisement -

Surekha Vani : ఈ వయసులోనూ యువ హీరోయిన్లకు దీటుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది సురేఖ వాణి. ముఖ్యంగా కూతురితో రీల్స్ చేయడం, డబ్బున్నోడు దొరికితే రెండో పెళ్లి చేసుకుంటానని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఆమె కూతురు సుప్రీతాకు కూడా సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. ఎలక్షన్ టైమ్ లో BRS పార్టీని గెలిపించడానికి చాలామంది సెలబ్రిటీస్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వీడియోలు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

వారిలో సురేఖ వాణితో పాటూ కూతురు సుప్రీత కూడా ఉన్నారు. ముఖ్యంగా సుప్రీత కారు ముందు నిలబడి BRSను గెలిపించమని కోరుతూ వీడియో చేసింది. ఇక తాజాగా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆ వీడియోని డిలీట్ చేసి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ ఫోటోని చూసిన నెటిజన్స్ ఈ తల్లి కూతుళ్ళపై రకరకాల కామెంట్స్ తో సోషల్ మీడియా అంతటా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే బూతులతో దాడి చేస్తున్నారు.

తాజాగా దీనిపై సుప్రీత రియాక్ట్ అవుతూ.. “రాజకీయ వివాదంలో నన్ను ట్యాగ్ చేసి మరీ వేధిస్తున్నారు. నేను మొదట BRSకు సపోర్ట్ చేశాను. అందులో తప్పేముంది. అదేవిధంగా గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పాను. ఈ మాత్రానికి నన్ను ట్రోల్ చేయడమేంటి? నేను మీకేం అన్యాయం చేశాను. నాపై ఎందుకింత ద్వేషం పెంచుకున్నారు. మీరు చేస్తున్న ట్రోలింగ్ వల్ల నా మానసిక ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి” అంటూ సుప్రీత తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here