Sai Pallavi : యాక్షన్ సినిమాలో సాయిపల్లవి.. యశ్ తో కలిసి రొమాన్స్ చేయనుందా..!

- Advertisement -

Sai Pallavi : ఒక్క కేజీఎఫ్ తో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్నాడు రాకింగ్ స్టార్ యశ్. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా రాణించిన యశ్.. కేజీఎఫ్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. దాదాపు అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత కేజీఎఫ్ 2 కూడా భారీ విజయం సాధించింది. రెండు భాగాలూ సూపర్ హిట్ అవడంతో యష్ నెక్ట్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Sai Pallavi
Sai Pallavi

కేజీఎఫ్ 2 తర్వాత యష్ సినిమాలకు చిన్న గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా యశ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అలాగే వచ్చే శుక్రవారం కొత్త మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు.. ఈ సినిమాలో కూడా ఆ సినిమాను మించిన భారీ యాక్షన్ తో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే ఈ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యష్ 19 సినిమాలో యష్ కు జోడీగా సాయి పల్లవి నటిస్తుందని టాక్ వినిపిస్తుంది . ఈ మూవీతో కన్నడ ఇండస్ట్రీలో సాయి పల్లవి అడుగుపెట్టనుందని తెలుస్తోంది. సాయి పల్లవి కూడా ఈ గార్గి తర్వాత గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ మూవీ చేస్తుంది. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న నయా మూవీలో నటిస్తుంది. ఈ చిత్రంకు తండేల్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here