ప్రస్తుతం టాలివుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.. ప్రముఖ ప్రొడ్యూసర్ కేపీ చౌదరి ని పోలిసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. పలువురు సినీ ప్రముఖులతో పాటు ఫేమస్ పొలిటీషియన్స్ కుమారులకు కూడా డ్రగ్స్ ఇచ్చినట్లు ఇన్వెస్టిగేషన్లో కేపీ చౌదరి అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసులో సెలబ్రిటీ అషురెడ్డి పేరు తెరపైకి వచ్చింది. బిగ్బాస్ బ్యూటీ అషురెడ్డితో కేపీ చౌదరి కొన్ని వందల సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు డేటాలో తేలిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.. అదే విధంగా సినీ నటి సురేఖ వాణి,ఆమె కూతురు సుప్రీత కూడా వందల సార్లు కాల్స్ వెళ్లినట్లు పోలీసుల విచారణలో బయటపడింది…
సుప్రీత, సురేఖావాణిలు కేపీ చౌదరికి బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుస్తుండగా… వీరికి డ్రగ్ దందాతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుగుతుంది. గతంలో ఈయనతో వీరిద్దరూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇక సురేఖ వాణి అతనికి ముద్దుల మీద ముద్దులు పెడుతున్న ఫోటోలు కూడా లీక్ అవ్వడం ఆ వార్తలు నిజమని జనాలు నమ్ముతున్నారు.. కేపీ చౌదరి కాల్ డేటాలో వీరి ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. పలుమార్లు వీరిద్దరితో కేపీ చౌదరి మాట్లాడాడు. వీరి మధ్య ఎలాంటి సంబాషణలు జరిగాయనే కోణంలో విచారణ జరుగుతుంది.
పోలీసులు ఛార్జ్ షీట్లో 12 మంది పేర్లు పొందుపరిచారు. అనూహ్యంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆమె అపార్ట్మెంట్లోనే కొకైన్ తో కూడిన డ్రగ్ పార్టీ జరిగిందట..ఆమె ఫాదర్ సిక్కి రెడ్డి హైదరాబాద్ లో లేదని చెప్పినట్లు తెలుస్తుంది.. బిగ్ బాస్ ఫెమ్ అషురెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అషురెడ్డితో కేపీ చౌదరి తరచుగా మాట్లాడతాడని తెలిసింది.. దీనిపై స్పందించిన అషు తనని కావాలని ఇరికిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే పోలీసుల విచారణ అయ్యేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..