Sureka vani : లగ్జరీ కారు కొన్న సురేఖ వాణి, కూతురితో కలసి సెలెబ్రేషన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు..

- Advertisement -

Sureka vani : తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉంటూ వచ్చిన నటి సురేఖ వాణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఒకటి అర చిత్రాల్లో మాత్రమే కనిపిస్తోంది.. అయితే భర్త చనిపోయిన తర్వాత గ్లామర్ షో చేస్తూ కూతురితో ఎంజాయ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.. ట్రెండ్ కు తగ్గట్లే డ్రెస్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తుంది..తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.. తాజాగా ఈమె లగ్జరి కారు కొన్నట్లు తెలుస్తుంది.. ఇందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Sureka vani
Sureka vani

తల్లీకూతుళ్లు ప్రస్తుతం లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒకరిని మించి ఒకరు ఉండేలా గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వీరిద్దరూ ట్రోలింగ్ ని కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారు. ట్రోలింగ్ మితిమీరినప్పుడు మాత్రమే సురేఖ వాణి ఘాటుగానే బదులిస్తోంది.తాజాగా సురేఖ వాణి, ఆమె కుమార్తె సుప్రీతా కలసి ఓ లగ్జరీ కారు కొన్నారు. వీరిద్దరూ షోరూంలో ఎంజి బ్రాండ్ కారుని కొనుగోలు చేశారు. ఆ ఫొటోస్ ని సుప్రీతా సోషల్ మీడియాలో షేర్ చేసింది. చూస్తుంటే వీరిద్దరూ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ కారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంతోషాన్ని తల్లి కూతుళ్లు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు…

Actress sureka vani
Actress sureka vani

నెటిజన్లు మాత్రం వీరిద్దరికీ కంగ్రాట్స్ చెబుతున్నారు. నిజంగా మీలాగా లైఫ్ ను ఎవరు ఎంజాయ్ చెయ్యరు.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..ఇటీవల సుప్రీతా థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే.. పొట్టి నిక్కర్ లో అందాల విందు చేసింది.. సముద్రరంలో బోటింగ్ చేస్తూ ఆమె ధరించిన ఓపెన్ షోల్డర్ డ్రెస్ కూడా మతులు చెడగొట్టే విధంగా ఉంది. ఆమె ఎద సోయగాలు ఉవ్వెత్తున ఎగసి పడే విధంగా ఉన్నాయి..నిత్యం సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడమే కాదు.. ట్రోల్స్ కు కూడా గురవుతారు.. ఎవరెన్ని అన్నా మా ఇష్టం అనడం విశేషం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here