అఖండ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఇంతకు ముందు ఎన్ని సూపర్ హిట్ సినిమాలు అయినా వచ్చి ఉండొచ్చు, ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉండొచ్చు. కానీ ‘అఖండ’ చిత్రం మాత్రం ఆయన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. బోయపాటి శ్రీను మరియు బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటేనే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వుధి.విడుదలకు ముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ వస్తాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రతీ ప్రాంతం లో స్టార్ హీరో సినిమాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఉంటుంది.
ఎందుకంటే ‘అఖండ’ చిత్రం కంటే ముందే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘సింహా’ మరియు ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. అందుకే అఖండ చిత్రం బిజినెస్ కానీ, దానిపై అభిమానుల్లో ఉన్న అంచనాలు కానీ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండేవి. ఇక విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోవడం లో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యింది ఈ సినిమా.
ఫలితంగా అతి తక్కువ టికెట్ రేట్స్ మీదనే 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ఇక ఈ చిత్రం బాలయ్య నట విశ్వరూపాన్ని చిన్న పిల్లల దగ్గర నుండి ముసలోళ్ల వరకు ప్రతీ ఒక్కరు జేజేలు పలికారు. ఇందులో బాలయ్య పాత్రకి ఎంత మంచి గుర్తింపు లభించిందో, విలన్ గా నటించిన శ్రీకాంత్ పాత్రకి కూడా అంతే మంచి గుర్తింపు లభించింది. ఎంతో సాఫ్ట్ గా కనిపించే హీరోలను కరుడుగట్టిన విలన్స్ గా చూపించడం డైరెక్టర్ బోయపాటి శ్రీను స్టైల్. గతం లో లెజెండ్ సినిమాలో జగపతి బాబు ని కూడా ఇలాగే చూపించారు.
ఇప్పుడు ఆయన రేంజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్రకి ముందుగా బాలీవుడ్ బడా హీరో సైఫ్ అలీ ఖాన్ ని సంప్రదించారట. కానీ అప్పటికీ ఆయన వేరే సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండడం వాళ్ళ చెయ్యలేకపోయాడట. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ చిత్రం ఆయన ఒప్పుకొని చేసి ఉంటే మరింత మైలేజ్ వచ్చేదని ఫ్యాన్స్ అభిప్రాయం.