Sundeep Kishan : సాయి ధరమ్ తేజ్ మాజీ ప్రేయసితో డేటింగ్ చేస్తున్న సందీప్ కిషన్!

- Advertisement -

Sundeep Kishan : తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి 10 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికీ తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయిన హీరోల లిస్ట్ తీస్తే అందులో సందీప్ కిషన్ ముందు వరుసలో ఉంటాడు. ఇతనికంటే ఆలస్యంగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోలంతా ఇప్పుడు వేరే లెవెల్ కి వచ్చేసారు. కానీ ఇతను మాత్రం ఎక్కడైతే మొదలయ్యాడో అక్కడే ఆగిపోయాడు. అందం, టాలెంట్ అన్నీ ఉన్నాయి, కానీ స్క్రిప్ట్ సెలక్షన్ సరైనవి ఎంచుకోకపోవడం వల్ల ఇతనికి మార్కెట్ ఏర్పడలేదు.

Sundeep Kishan
Sundeep Kishan

ఇదంతా పక్కన పెడితే ఈయన రీసెంట్ గా హీరో గా నటించిన ‘ఊరిపేరు భైరవకోన’ అనే చిత్రం ఈ నెల 16 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు సందీప్ కిషన్.

ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ సందీప్ కిషన్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ నిజ జీవితం లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా’ అని అడగగా, దానికి సందీప్ కిషన్ సమాధానం చెప్తూ ‘ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు లవ్ స్టోరీస్ ఉన్నాయి. అందరినీ చాలా సీరియస్ గా ప్రేమించాను, కానీ ఎందుకో ఒక్కరితో కూడా నా ప్రేమ నిలబడలేదు. నేను ప్రేమించిన అమ్మాయిలందరూ ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళే’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే చాలా కాలం నుండి ప్రముఖ హీరోయిన్ రెజీనా తో సందీప్ కిషన్ డేటింగ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపించేవి.

- Advertisement -

రెజీనా అంతకు ముందు సాయి ధరమ్ తేజ్ తో కూడా ప్రేమాయణం నడిపింది అనే విషయం తెలిసిందే. రెజీనా తో మీరు లవ్ లో ఉన్నారా అని సందీప్ కిషన్ ని అడగగా, ఆయన దానికి సమాధానం చెప్తూ ‘అందరూ రెజీనా కి నాకు ఎదో సంబంధం ఉందని అంటూ ఉంటారు. కానీ మా మధ్య ఎలాంటి ప్రేమ లేదు. రెజీనా నాకు బెస్ట్ ఫ్రెండ్, ఇండస్ట్రీ లోకి రాకముందు ఒకే కాలేజీ లో చదువుకునే వాళ్ళం కూడా’ అంటూ చెప్పుకొచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here