Suma: ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజీవ్ కనకాల మొదటగా బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. ఇకపోతే సీరియల్స్ లో నటిస్తున్నప్పుడే సహా నటి సుమాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇక తర్వాత సుమా కూడా అటు సినిమాలలో కూడా నటించి ఆ తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేసింది . తర్వాత యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించి సంవత్సరాల తరబడి వాటిని కొనసాగించి మంచి సక్సెస్ అందించింది.

ఇక బుల్లితెర షోలు మాత్రమే కాదు వెండి తెర ఈవెంట్లకి కూడా ప్రత్యేకంగా హోస్ట్గా వ్యవహరిస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా సినిమా ఈవెంట్లకు ఈమె యాంకర్ గా వ్యవహరించింది అంటే కచ్చితంగా ఆ ఈవెంట్ సక్సెస్ అవుతుందనే సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అంతలా తన పర్ఫామెన్స్ తో చెరగని ముద్ర వేసుకుంది సుమ. మరొకవైపు సుమ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని చెప్పాలి. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారుతుంది అందులో సుమా ఆమె భర్త రాజీవ్ కనకాల ఇంట్లో పూజలు చేస్తున్నట్లు మనం చూడవచ్చు.
అయితే కుటుంబ సంక్షేమం కోసమే ఈ ఇద్దరు ఇలా ప్రత్యేకంగా పూజలు నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇకపోతే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కాగా ఇక వీరి కొడుకు రోషన్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి