Sukumar : ఇండియా లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితా లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఉంటాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘ఆర్య’ సినిమా ద్వారా ఈయన ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత సుకుమార్ తనదైన మార్కుని చూపిస్తూ ప్రతీ సినిమాని ఎంతో డిఫరెంట్ గా తీస్తూ వచ్చాడు.
అన్నీ సినిమాలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, ‘ఆర్య’ సినిమా తర్వాత రీసౌండ్ వచ్చే హిట్ కొట్టింది మాత్రం ‘రంగస్థలం’ చిత్రం తోనే. ఈ సినిమా తర్వాత ‘పుష్ప’ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ కి రీచ్ అయిపోయాడు. అయితే సుకుమార్ ఆర్య సినిమా షూటింగ్ చేస్తున్న సమయం లో తనకి సంబంధించిన అనుభూతుల గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా క్లైమాక్స్ కోసం సుకుమార్ ఏకంగా 20 వెర్షన్లు రాసుకున్నాడట. అందులో రెండు వెర్షన్స్ గురించి వివరిస్తూ, ఈ లవ్ స్టోరీ ని ఒక ట్రాజెడీ లాగ ముగిద్దాం అని అనుకున్నాడట. కానీ కథకి అది సెట్ అవ్వట్లేదని, రెండవ వెర్షన్ ని తీసుకుందాం అనుకున్నాడట.
ఈ రెండవ వెర్షన్ లో అజయ్ క్యారక్టర్ పాజిటివ్ గా మారిపోవడం, అప్పుడు ఆర్య అజయ్, గీతలను కలిపి తాను దూరం అయిపోయి ఒంటరిగా మిగలడం, ఇలా ఎన్నో వెర్షన్స్ రాసుకున్న తర్వాత చివరికి హీరో హీరోయిన్ ని కలపడమే ఉత్తమం అనే అభిప్రాయానికి వచ్చి ప్రస్తుతం మనం చూసే క్లైమాక్స్ ని ఫైనల్ చేసాడట. ఈ విషయాన్నీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు సుకుమార్. ఇకపోతే సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ సీక్వెల్, ‘పుష్ప : ది రూల్’ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా ఆగష్టు 15 వ తారీఖున మన ముందుకు రాబోతుంది.