Pawan Kalyan OG : ఓజీ సినిమా ఎలా ఉంటుందో.. ఫ్యాన్స్ వెయిటింగ్‌…

- Advertisement -

Pawan Kalyan OG ఇంతకముందు వరకూ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్… ఇప్పుడు మాత్రం ఓజస్ గంభీర. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా “దే కాల్ హిమ్ ఓజీ”, ఈ సినిమాలోనే పవన్ కళ్యాణ్ గంభీర అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. పంజా తర్వాత ముంబై బ్యాక్ డ్రాప్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్ స్టర్ డ్రామా కావడంతో ఓజీ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ లుక్, ప్రీ టీజర్, హంగ్రీ చీత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లు ఓజీ సినిమాపై హైప్ మరింత పెంచాయి. సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వడంతో ఓజీ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. లేటెస్ట్‌గా ఓజీ స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్నట్టు ఓజీ ప్రమోషనల్ వీడియో చూస్తేనే తెలిసిపోతుంది. బూట్ కట్ ప్యాంట్స్, వింటేజ్ కార్స్… ఓజీ టైమ్ లైన్ ను తెలిసేలా చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త ప్రకారం… 90‘ల కాలంలో ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్‌ ఓజస్ గంభీర… కొన్ని కారణాలవల్ల పదేళ్ల పాటు మాఫియాకు దూరంగా ఉంటాడట పవన్. కొన్ని కారణాలతో గతాన్ని వదిలేసి మాఫియాకి దూరం జరిగిన పవన్ కళ్యాణ్… తిరిగి వచ్చిన తర్వాతే సినిమా రేంజ్ మారుతుందని టాక్. దాదాపు ఇలాంటి కథతోనే సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్ బస్టర్ సినిమా చేసాడు.

pawan kalyan
pawan kalyan

ప్రస్తుతం ఇండియాలో ఏ కమర్షియల్ సినిమా తెరకెక్కిన దానికి మూలకథ వచ్చేది బాషా సినిమా నుంచే. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాలో మాఫియా డాన్ గా ఇచ్చిన గూస్ బంప్స్ ని పాన్ ఇండియా ఆడియన్స్ ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ రేంజ్ కథతో ఓజీ తెరకెక్కిస్తే మాత్రం సుజిత్… బాక్సాఫీస్ దగ్గర భూకంపం తెచ్చినట్లే. సుజిత్ సినిమాని పెర్ఫెక్ట్ గా వర్కౌట్ చేస్తే పవన్ ఊచకోతకు మాఫియానే కాదు బాక్సాఫీస్‌ కూడా వణికిపోవడం గ్యారెంటీ. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ హంగ్రీ చీతా వసూళ్ల వేట మామూలుగా ఉండదనే చెప్పాలి. సెప్టెంబర్‌ 27న ఓజిని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయబోతున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో… ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. ఎస్ఎస్ తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. మరి ఓజి ఊచకోత ఎలా ఉంటుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here