Sujith : పవన్ కళ్యాణ్ కోసం 100 కోట్ల రూపాయిలను పోగొట్టుకున్న సుజిత్..మరీ ఇంత అభిమానమా!Sujith : ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ తో పాటుగా పవన్ కళ్యాణ్ వీరాభిమానుల జాబితా తీస్తే అందులో సుజిత్ కచ్చితంగా ఉంటాడు. తమ అభిమాన హీరోల కెరీర్స్ నత్తనడకన సాగుతున్నప్పుడు, వాళ్లకి మళ్ళీ బూస్ట్ ని ఇవ్వడానికి అభిమానులే డైరెక్టర్స్ గా వస్తుంటారు అని సోషల్ మీడియా లో ఒక స్లోగన్ కొంతకాలం గా బాగా ట్రెండ్ అయ్యింది.

Sujith
Sujith

హరీష్ శంకర్ మరియు సుజిత్ వంటి డైరెక్టర్స్ ని వారితో పోల్చవచ్చు. వరుస ఫ్లాప్స్ తో కెరీర్ స్లంప్ స్టేజి లో ఉన్న పవన్ కళ్యాణ్ కి ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించి ఆయన కెరీర్ గ్రాఫ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు హరీష్ శంకర్. ఇప్పుడు వరుస రీమేక్ సినిమాలతో అభిమానుల్లో కూడా విపరీతమైన నెగటివిటీ ఏర్పడిన సమయం లో ‘ఓజీ’ లాంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్ తో సుజిత్ మన ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాపై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో ఏ రేంజ్ క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గ్లిమ్స్ వీడియో తోనే సినిమా పై అంచనాలు వేరే లెవెల్ కి చేరుకుంది. ఇదంతా పక్కన పెడితే సుజిత్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం కోసం బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో సినిమా చేసే ఛాన్స్ ని కూడా వదులుకున్నాడట. ఒక స్పై సిరీస్ ని షారుఖ్ ఖాన్ తో ప్లాన్ చేసాడట సుజిత్. రెండు భాగాలుగా తెరకెక్కే ఈ సిరీస్ కోసం సుజిత్ వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఆఫర్ వచ్చిందట.

కానీ సుజిత్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి వచ్చిన తర్వాతే చేస్తాను అని దృఢమైన నిర్ణయం తీసుకొని, షారుఖ్ ఖాన్ ఆఫర్ ని కొంత కాలం వరకు హోల్డ్ లో పెట్టారట. పవన్ కళ్యాణ్ కోసం వంద కోట్ల రెమ్యూనరేషన్ ని కూడా పక్కన పెట్టాడు అంటే, ఆయనతో ఎలాంటి సినిమా తీస్తున్నాడో అర్థం అవుతుంది అని అభిమానులు సోషల్ మీడియా లో అనుకుంటున్నారు.

Tags: