Sujatha : మొగుడికి ఊహించని షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సుజాత

- Advertisement -


Sujatha : జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. రాకేష్, యాంకర్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్‌లో పలు స్కిట్‌లలో నటించిన రాకేష్ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించాడు. ఆ మధ్య కేసీఆర్ బయోపిక్ అనౌన్స్ మెంట్ కూడా చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఇంకా పూర్తి కాలేదు. రాకేష్‌ని పెళ్లాడిన సుజాత కూడా ప్రేక్షకులకు సుపరిచితమే. ఓ టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేసి బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంది.

jordar sujatha jabardasth rakesh
jordar sujatha jabardasth rakesh

అచ్చ తెలంగాణ యాసలో మాట్లాడే సుజాత, రాకేష్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత యాంకరింగ్ కు గుడ్‌బై చెప్పి జబర్దస్త్ రాకేష్‌తో కలిసి స్కిట్‌లలో కనిపిస్తోంది. కొంతకాలం క్రితం ఆమె తన సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ని కూడా ప్రారంభించింది. సుజాత ఇటీవల చేసిన పనికి రాకేష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.

ఇటీవలే వాస్తు బాగోలేదని ఇంటి మొత్తం ఖాళీ చేసిన సుజాత.. ఇప్పుడు సడన్ సర్ ప్రైజ్ ఇస్తూ.. ఇల్లు కొనుక్కున్నట్లు తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోను కూడా షేర్ చేసింది. తన భర్తకు తెలియకుండా ఫ్లాట్ కొన్నట్లు చూపించింది.. ఈ ఫ్లాట్ దాదాపు 17వ అంతస్థులో ఉన్నట్లు సుజాత ఈ వీడియోలో చూపించింది.. అంతేకాదు ఈ ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయించినట్లు చెప్పింది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న రాకేష్.. నువ్వు ఇంత పెద్ద స్థాయికి ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆమె వైపు చూశాడు.. ఇంతలో సుజాత అనూహ్యంగా ఈ ఇల్లు తాను కొనలేదని, ఇరుగుపొరుగు వారు కొన్నారు అని చెప్పింది. దీంతో రాకేష్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com